Arjun Kapoor: బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, మలైకా అరోరా కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికీ వయసులో గ్యాప్ ఉన్న మాట నిజమే చెప్పాలి. మలైకాకు 48 ఏళ్లు కాగా, అర్జున్ కపూర్ కి 36 సంవత్సరాలు. ఇద్దరి మధ్య పన్నెండేళ్ల తేడా ఉంది. అయితే ఇవి పట్టించుకోకుండా ఈ జంట తమ లవ్ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. కానీ వీరి ప్రేమపై తరచూ ట్రోల్స్ వస్తుంటాయి. మలైకాకు ఇదివరకే అర్భాజ్ ఖాన్ తో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ మలైకా తన భర్తతో విడిపోయింది. తన కొడుకు కోసం అప్పుడప్పుడు అర్భాజ్ ను కలుస్తుంటుంది.
కాగా ఆంటీని ప్రేమించడం ఏంటంటూ అర్జున్ ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తుంటారు. అయితే తొలిసారి తమపై జరుగుతోన్న ట్రోలింగ్ పై హీరో అర్జున్ కపూర్ స్పందించారు. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ… ‘నాకు తెలిసి ఇలాంటి వ్యాఖ్యలపై రెస్పాన్స్ కోరుకునేది మీడియా మాత్రమే’ అంటూ దిమ్మతిరిగే కౌంటర్ వేశారు. ఆ తరువాత ఇలాంటి ట్రోలింగ్ ని తాను పెద్దగా పట్టించుకోనని, అవన్నీ నిజం కాదని అన్నారు.
ట్రోలింగ్ చేసేవాళ్లే నేను కలిసినప్పుడు సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారని చెప్పారు. ట్రోలింగ్ ని నమ్మలేమని, తన వ్యక్తిగత జీవితంలో ఏదైనా చేస్తానని వెల్లడించారు. అది తన హక్కు అని… తన పనికి తగ్గ గుర్తింపు లభిస్తే చాలని అర్జున్ కపూర్ అన్నారు. ఎవరు వయసు ఎంత అనే దాని గురించి అంతగా బాధ పడాల్సిన అవసరం లేదని… వయసుని చూసి రిలేషన్షిప్ లో దిగడమనేది పిచ్చితనమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Arjun kapoor fires on trollers about releation with malaika arora
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com