Arjuna Falguna: వైవిధ్యభరిత కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా తేజ మర్ని దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. అయితే, రిలీజ్ అయిన మొదటి షో నుంచి ‘అర్జున ఫల్గుణ’ టాక్ చాలా బ్యాడ్ గా వచ్చింది. పైగా ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక రెండో షోకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు.

ఒక విధంగా ఈ మధ్య కాలంలో శ్రీవిష్ణు హీరోగా చేసిన సినిమాల్లోనే ‘అర్జున ఫల్గుణ’ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యం. అయితే, ఓసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను చూద్దాం.
నైజాం 0.14 కోట్లు
గుంటూరు 0.08 కోట్లు
కృష్ణా 0.03 కోట్లు
నెల్లూరు 0.02 కోట్లు
సీడెడ్ 0.09 కోట్లు
ఉత్తరాంధ్ర 0.07 కోట్లు
ఈస్ట్ 0.05 కోట్లు
వెస్ట్ 0.03 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 0.51 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.06 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.57 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
Also Read: అలాంటి వాళ్ళని వదిలేదు లేదు అంటున్న బాలయ్య… ఎదురుపడితే దబిడిడిబిడే అంటూ వార్నింగ్ ?
నిజానికి ‘అర్జున ఫల్గుణ’ సినిమాకి రూ.2.3 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అయితే, జరిగిన బిజినెస్ కి వచ్చిన కలెక్షన్స్ కి ఏ మాత్రం పొంతన లేదు. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమాకి కేవలం రూ.0.57 కోట్ల షేర్ ను మాత్రమే వచ్చింది. మొత్తమ్మీద ఈ సినిమా పెద్ద డిజాస్టర్లకే డిజాస్టర్ గా నిలిచింది.
Also Read: ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం.. మళ్లీ ఏపీ అంటుకుంది.. తప్పెవరిది?