Homeఎంటర్టైన్మెంట్హౌస్ లో ఆడ-మగ తేడా లేదా... ఏం మెసేజ్ ఇస్తున్నావ్ నాగ్ ?

హౌస్ లో ఆడ-మగ తేడా లేదా… ఏం మెసేజ్ ఇస్తున్నావ్ నాగ్ ?

Nagarjuna
భారతదేశంలో బిగ్ బాస్ షోని సాంప్రదాయ వాదులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఆడ, మగా ఒక ఇంటిలో ఉండడం, కెమెరా ముందే ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోవడం కొందరికి నచ్చడం లేదు. భారతీయ సాంప్రదాయానికి విరుద్ధమైన ఈ షో సమాజంపై చెడు ప్రభావం చూపిస్తుందని వాదిస్తున్నారు. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ షోపై వ్యతిరేకత నడిచింది. బిగ్ బాస్ సీజన్ 3కి ముందు… షో ఆపేయాలని కొందరు ఆందోళనలు చేశారు. బిగ్ బాస్ సీజన్3 హోస్ట్ నాగార్జున అని తెలుసుకున్న విద్యార్థులు ఆయన ఇంటి ముందు ఆందోళన చేయడం జరిగింది.

Also Read: ఎక్స్ క్లూజివ్: హిట్ కాంబినేషన్ లో మరో ఎంటర్ టైనర్ !

షోను నిలిపివేయాలని కోర్ట్ లలో పిటీషన్స్ వేయడం కూడా జరిగింది. ఎవరెన్ని చేసినా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. నిన్న ఎపిసోడ్ చూస్తే సాంప్రదాయవాదుల వాదనలో నిజం ఉందని అనిపిస్తుంది. గత వారం ఒక టాస్క్ లో భాగంగా అరియనా, సోహెల్ గొడవపడ్డారు. వీరిద్దరి గొడవ తారాస్థాయికి చేరగా, అరియనాపైకి దూసుకువచ్చిన సోహెల్ పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీనితో అమ్మాయిని అని కూడా చూడకుండా సోహెల్ తనపైకి దాడికి వచ్చాడని కెమెరా ముందు చెప్పింది.

Also Read: బాక్సర్ కోసం వెతుకుతున్న ఫైటర్ !

శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇదే విషయాన్ని లేవనెత్తాడు. హౌస్ లో లేడీ కార్డు ఎందుకు ఉపయోగించావని అని అరియానాను నిలదీశాడు. లేడీ కార్డు ఉపయోగించి సోహెల్ ని బ్యాడ్ చేద్దామనుకున్నావా లేక ఎలిమినేషన్ నుండి సేవ్ అవుదామని అనుకుంటున్నావా అని విమర్శించారు. బిగ్ బాస్ హౌస్ లో ఆడ, మగా తేడా లేదని బల్లగుద్ది చెప్పాడు. సనాతన కాలం నుండి ఆడవాళ్ళకు భారతీయ సమాజంలో విశిష్ట గౌరవం ఉంది. తల్లిగా, భార్యగా కీలక బాధ్యత వహించే ఆడవాళ్లను పూజించడం మన సాంప్రదాయం. అలాంటి కట్టుబాట్లు వదిలేసి అన్నీ తెలిసిన నాగార్జున… బిగ్ బాస్ హౌస్ కాబట్టి బేధాలు లేవని, ఎవరు ఎవరిపైన అయినా దాడి చేయవచ్చని చెప్పడం ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నాడో… ఆయనకే తెలియాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version