https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్: హిట్ కాంబినేషన్ లో మరో ఎంటర్ టైనర్ !

స్టార్ డైరెక్టర్ అంటే.. అతని కెరీర్ కి ఒకప్పుడు ఇరవై ఏళ్ళు గ్యారంటీ ఉండేది. అందుకే, ఒక్క హిట్ సినిమాతో ఒకసారి పేరు తెచ్చుకుంటే చాలు, ఇక ఆ డైరెక్టర్ కి ప్లాప్స్ వచ్చినా సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ, కాలం మారింది. ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపోయింది. ప్లాప్ వస్తే.. స్టార్ డైరెక్టర్ అయినా, చోటా డైరెక్టర్ అయినా ఇప్పుడు ఒక్కటే. కనికరం కూడా చూడరు. చిన్న ఛాన్స్ ఇవ్వడానికి కూడా హీరోలు ఆలోచిస్తారు. అతనిలో […]

Written By:
  • admin
  • , Updated On : December 13, 2020 / 05:43 PM IST
    Follow us on


    స్టార్ డైరెక్టర్ అంటే.. అతని కెరీర్ కి ఒకప్పుడు ఇరవై ఏళ్ళు గ్యారంటీ ఉండేది. అందుకే, ఒక్క హిట్ సినిమాతో ఒకసారి పేరు తెచ్చుకుంటే చాలు, ఇక ఆ డైరెక్టర్ కి ప్లాప్స్ వచ్చినా సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ, కాలం మారింది. ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపోయింది. ప్లాప్ వస్తే.. స్టార్ డైరెక్టర్ అయినా, చోటా డైరెక్టర్ అయినా ఇప్పుడు ఒక్కటే. కనికరం కూడా చూడరు. చిన్న ఛాన్స్ ఇవ్వడానికి కూడా హీరోలు ఆలోచిస్తారు. అతనిలో మంచి టాలెంట్ ఉన్నా.. ప్లాప్ డైరెక్టర్ గానే చూస్తారు. ప్రస్తుతం ఒక స్టార్ డైరెక్టర్ పరిస్థితి అలాగే తయారైంది.. ఆయనే డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఒక్క బాలయ్య తప్ప.. ప్రస్తుతం ఆయనకు ఏ స్టార్ హీరో పిలిచి అవకాశం ఇచ్చిన దాఖలాలు కనిపించకపోవడం లేదు.

    Also Read: త్రివిక్రమ్ చేతుల్లోకి ‘రామాయణం’ !

    బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి కానుంది. మరి ఆ తరువాత పరిస్థితి ఏమిటి ? అందుకే ఇప్పటినుండే బోయపాటి తరువాత సినిమా పై దృష్టి పెట్టాడు. కాగా ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్నారని, లేదూ అల్లు అర్జున్ నటిస్తున్నారని ఇటివలే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా తాజాగా తన తరువాత సినిమాని రవితేజతో చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది.

    Also Read: పవన్ పక్కన అంటే వామ్మో చేయమంటున్న హీరోలు!

    అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు గాని, బోయపాటి శ్రీను మాత్రం ఇప్పటికే రవితేజ కోసం ఓ స్క్రిప్టును సిద్ధం చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా రవితేజకు సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. మరి బోయపాటి – రవితేజ కలయిక పై క్లారటీ వచ్చేదాకా సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించిన రూమర్స్ పుంఖానపుంఖాలుగా వస్తూనే ఉంటాయేమో. ఏది ఏమైనా బాలయ్యతో చేస్తోన్న సినిమా హిట్ అయితేనే.. బోయపాటికి క్రేజ్ ఉంటుంది. లేకపోతే.. అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్