నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా ‘లవ్ స్టోరీ’ ఫస్ట్ కాపీ రెడీ అయింది. సన్నిహితులకు ఈ రోజు ఈ సినిమా ప్రివ్యూ కూడా వేశారట. అయితే, ఈ సినిమా చూసినవారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కుల వ్యవస్థకి సంబంధించి సున్నితమైన సమస్యను డీల్ చేశారని తెలుస్తోంది. కుల ఆధారిత సమస్యనే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి ప్రధాన నేపథ్యంగా తీసుకున్నాడట. అలాగే, కథలో మరో మెయిన్ పాయింట్ వచ్చేసరికి.. ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమికులకు తమ ప్రేమను త్యాగం చేయాల్సిన పరిస్థితి రావడం, ఆ పరిస్థితుల నుండి వాళ్ళు బయటపడలేకపోవడం, చివరికీ ఒకరికి తెలియకుండా ఒకరు తమ ప్రేమను ఎలా త్యాగం చేయాలనుకున్నారు.
Also Read: ఎక్స్ క్లూజివ్: హిట్ కాంబినేషన్ లో మరో ఎంటర్ టైనర్ !
ఈ క్రమంలో వాళ్ళు మళ్ళీ ఎలా కలిశారు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా క్రేజీ కాంబినేషన్ తో ఈ ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్నాడు. అందుకే ఈ సినిమా కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.. పైగా ఇప్పటికే ఈ సినిమాకి ఉన్న మార్కెట్ కంటే కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేశాయని సమాచారం.
Also Read: బాక్సర్ కోసం వెతుకుతున్న ఫైటర్ !
అన్నిటికి మించి శేఖర్ కమ్ముల ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇష్టమైన డైరెక్టర్ కావడంతో.. ఓటిటీ ప్లాట్ ఫామ్స్ ఈ సినిమా కొనడానికి పోటీ పడుతున్నాయట. ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేసే సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. అందుకే నిర్మాతలు ఎక్కాడా వెనక్కి తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి వస్తుండటం మరో విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్