https://oktelugu.com/

Prabhas Radhe Shyam Movie: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పై నిక్ పౌల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Prabhas Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీపై మంచి అంచనాలున్నాయి. కాగా రాధేశ్యామ్ చిత్రానికి పనిచేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని యాక్షన్ డైరెక్టర్ నిక్ పౌల్ తెలిపాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో 25 రోజులపాటు క్లైమాక్స్, బల్గేరియాలో నీటి అడుగున చిత్రీకరించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నాడు. ప్రమాదకర సన్నివేశాల్లో ప్రభాస్ ఎంతో తేలిగ్గా నటించాడని చెప్పాడు. ఇక రాధేశ్యామ్ మూవీ మార్చి 11న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తాజాగా ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 2, 2022 / 12:18 PM IST
    Follow us on

    Prabhas Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీపై మంచి అంచనాలున్నాయి. కాగా రాధేశ్యామ్ చిత్రానికి పనిచేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని యాక్షన్ డైరెక్టర్ నిక్ పౌల్ తెలిపాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో 25 రోజులపాటు క్లైమాక్స్, బల్గేరియాలో నీటి అడుగున చిత్రీకరించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నాడు. ప్రమాదకర సన్నివేశాల్లో ప్రభాస్ ఎంతో తేలిగ్గా నటించాడని చెప్పాడు.

    Prabhas Radhe Shyam Movie

    ఇక రాధేశ్యామ్ మూవీ మార్చి 11న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తాజాగా ఈ సినిమాలోని ప్రభాస్ స్టిల్‌ను అభిమానుల కోసం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజా పోస్టర్‌లో ప్రభాస్ లుక్ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అటు రేపు ఈ మూవీ నుంచి రెండో ట్రైలర్ రానుంది. ప్రస్తుతం ఈ కొత్త స్టిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నాడు.

    Also Read:   టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్

    అన్నట్టు ఆంధ్రలో రాధేశ్యామ్ సినిమా కోసం బయ్యర్లు భారీ రేట్లు పెట్టారు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది అయోమయం అయిపోయింది. అయితే, రాధేశ్యామ్‌ యూఎస్ లోని ఐమాక్స్ థియేటర్‌ బుకింగ్స్‌లో కూడా అప్పుడే 70 శాతం టికెట్స్ అమ్ముడు పోయాయి. మొత్తానికి విడుదలకు ముందే రాధేశ్యామ్‌ రికార్డుల వెంట మొదలైనట్టు ఉంది. ఎంతైనా నేషనల్ స్టార్ గా ప్రభాస్‌ రేంజ్‌ ప్యాన్‌ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో పెరిగిపోయింది.

    Prabhas Radhe Shyam Movie

    రాధేశ్యామ్‌ కోసం దాదాపు రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్‌ నటించే యాక్షన్‌ బ్లాస్టర్‌ సలార్‌ పై ఓ ఆసక్తికర విషయం చర్చలో ఉంది. మొత్తానికి హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని.. మెయిన్ గా కళ్ళు చెదిరే యాక్షన్స్ తో అబ్బుర పరిచే విజువల్స్ తో ప్రభాస్ ఆకట్టుకుంటాడట.

    Also Read: ముమైత్ ఖాన్ యాక్షన్.. శ్రీరాపాక రియాక్షన్

    Tags