Homeఎంటర్టైన్మెంట్This Week OTT Releases: ఈవారం ఓటీడీలో పండగ చేసుకోండి.. ఫ్యూజులు ఎగిరిపోయే సినిమాలు

This Week OTT Releases: ఈవారం ఓటీడీలో పండగ చేసుకోండి.. ఫ్యూజులు ఎగిరిపోయే సినిమాలు

This Week OTT Releases: హరిహర వీరమల్లుగా థియేటర్లలో పవన్ కళ్యాణ్ సందడి చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన స్ట్రెయిట్ మూవీ హరి హర వీరమల్లు. అయితే హరి హర వీరమల్లు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదని, ముగింపు సరిగా లేదంటున్నారు. కాగా నెక్స్ట్ వీక్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హరి హర వీరమల్లు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో కింగ్ డమ్ కొరకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read:  మహేష్, రాజమౌళి సినిమా.. పెద్ద ప్లానింగే..మొత్తం లీక్ అయ్యిందిగా!

అయితే ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేయాలా అని మూవీ లవర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.

కన్నప్ప

మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప జూన్ 27న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ గెస్ట్ రోల్ చేయడం కన్నప్ప చిత్రానికి ప్లస్ అయ్యింది. ఆయన కారణంగా మంచి ఓపెనింగ్స్ దక్కాయి. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యాస్ట్ నటించిన కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. విడుదలై నెల గడవక ముందే కన్నప్ప ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది. జులై 25 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

Also Read: ‘పుష్ప 2’ ఎఫెక్ట్ : సంధ్య థియేటర్ నుంచి తల్లిబిడ్డల గెట్ అవుట్…

షో టైమ్

నవీన్ చంద్ర నటించిన క్రైమ్ థ్రిల్లర్ షో టైమ్. ఈ సినిమా జులై 4న థియేటర్స్ లో విడుదల చేశారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న షో టైమ్ మూవీ సన్ నెక్స్ట్ లో జులై 25 నుండి స్ట్రీమ్ కానుంది.

మార్గన్

విజయ్ ఆంటోనీ మార్గన్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జూన్ 27న విడుదలైంది. ఈ చిత్రం సైతం నాలుగు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. మార్గన్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో జులై 25 నుండి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

తమ్ముడు

వేణు శ్రీరామ్ నితిన్ కాంబోలో వచ్చిన చిత్రం తమ్ముడు. నటి లయ తమ్ముడు తో రీ ఎంట్రీ ఇచ్చింది. నితిన్ కి అక్క పాత్ర చేశారు లయ. తమ్ముడు జులై 4న విడుదల చేశారు. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన తమ్ముడు ఓటీటీలో ఆగస్టు 1న అందుబాటులో కి రానుంది.
ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు.

Exit mobile version