Tollywood: సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. ఇక అందులో భాగంగానే సినిమాకి సంబంధించిన డబ్బులు పెట్టే కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం వీలైతే ఎవరినైనా ఒకరిని వాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ వారిని ముగ్గులోకి దింపి ఎలాగైనా సరే వాళ్ళను శారీరకం గా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీమణులు సైతం ప్రొడ్యూసర్లతో చాలా మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకొని వాళ్లను వాడుకొని అవకాశాలను అందుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక ఇదంతా రొటీన్ గా జరిగే వ్యవహారమే…ఇక సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం.. ఇక్కడ ఒక్కసారి సెలబ్రిటీ హోదా వచ్చిందంటే ఆ హోదాని కాపాడుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాల కోసం చాలామంది హీరోయిన్లు దేనికైనా సరే తెగించి ముందడుగు వేస్తూ ఉంటారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి డబ్బులకు డబ్బులు క్రేజ్ కి క్రేజ్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు అలా చేస్తుంటారు. ఇక ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించే అవకాశం అయితే లేదు. ఎవరి అవకాశం కోసం వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలకు పాల్పడుతుంటారు. కాబట్టి ఒకరిని ఒకరు లోబరుచుకొని ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తప్పు ఒప్పు లను చూసే కంటే ఏది చేసైనా కుడా అవకాశాలను అందుకుంటూ వాళ్లు ముందుకు సాగుతున్నారు అనే దాని మీదనే సినీ పెద్దలు సైతం ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు లైట్ తీసుకుంటూ వస్తున్నారు…
ఇక సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్లు హీరోయిన్లతో సహజీవనం చేసి వాళ్ళని పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు పెట్టడమే కాకుండా లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారని చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఒక రూమర్ అయితే చక్కర్లు కొడుతుంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ మీద బయట జనాలకి అంత మంచి ఒపీనియన్ అయితే లేదు. అందువల్లే చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు సైతం సినిమా ఇండస్ట్రీకి రావడానికి భయపడిపోతున్నారు.
ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎలా మోసం చేస్తారో తెలియదు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మాత్రం ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయని మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇక రీసెంట్ గా సినీ సెలబ్రిటీలు వాళ్ళని శారీరకంగా వేధించారు అంటూ వాళ్ల బాధితులు కేసులను ఫైల్ చేస్తున్న విషయాలను కూడా మనం చూస్తున్నాము.
ఇక వెలుగులోకి వచ్చిన కేసులే ఇవైతే ఇంక వెలుగులోకి రాని కేసులు ఇంకెన్ని ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికైతే ఇక్కడ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకపోతే స్టార్ స్టేటస్ అనేది రాదు అని చాలా కచ్చితంగా చెబుతుంటారు. అందువల్లే టాలెంట్ ఉన్న కూడా కొంతమంది అమ్మాయిలు ఇండస్ట్రీ వైపు రావడానికి ఆలోచిస్తున్నారనే చెప్పాలి…