Heroes : ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటన వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం అయితే రేగుతుంది. ఇక గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ను పాటిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్తున్న సమయంలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంతవరకు వెనకబడి పోయే పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి అంటూ సినిమా పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…నిజానికి పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటన ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ ఇకమీదట రాబోయే ఏ సినిమాకి కూడా ప్రీమియర్ షోస్ కానీ, బెనిఫిట్ షోస్ కానీ అవకాశం లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇక రీసెంట్ గా సినిమా పెద్దలు సిఎం తో ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా ఆయన అదే చెప్పడం విశేషం… మరి ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన బెన్ఫిట్ షోస్ కి పర్మిషన్స్ ఇవ్వకపోవడం తో ఆ సినిమాలకు కలెక్షన్స్ పరంగా భారీగా నష్టాలు వచ్చే అవకాశలైతే ఉన్నాయి అంటూ కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించనంత వరకు సినిమా వాళ్లకు ఎలాంటి ఆఫర్స్ అయినా ఇవ్వడానికి తను రెడీగా ఉన్నానని చెప్పాడు.
కానీ బెనిఫిట్స్ వల్ల క్రౌడ్ విపరీతంగా పెరిగిపోయి జనాల ప్రాణాలు పోయే స్థాయికి రావడం అనేది సరైన విషయం కాదు. కాబట్టి ఆయన కూడా ఇలాంటి నిర్ణయాలను కరాకండిగా అమలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా? లేదంటే ఇలాగే ఉండబోతున్నాడా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…
సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి సినిమాలకు బెనిఫిట్ షోస్ కి, ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇవ్వాలంటే మాత్రం నిర్మాతలు, హీరోలు పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంలో ఎలాంటి ఘటనలైతే జరిగాయో అలాంటి ఘటనలు జరగకుండా మేము చూసుకుంటాం…అంటూ పలు హామీలు ఇచ్చి అలాగే థియేటర్ యాజమాన్యం కూడా ఎక్కువ మంది క్రోడ్ వచ్చిన తట్టుకునేలా ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశాము అంటూ వాళ్ళు ఆధారాలతో సహా చూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆ షోలకి పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే మొదటి రోజు ఏ హీరో కూడా థియేటర్ కి వెళ్లి హంగామా చేయడానికి వీలు లేదు అంటూ అందులో మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక దాంతో పాటుగా సమాజానికి మేలు చేసే కొన్ని వీడియోలను కూడా హీరోలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ కి ఒప్పుకున్నట్టైతే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రీమియర్ షోస్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది…