Nandamuri family new Heroes: బాలయ్య బాబు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాయి. కానీ ఆయన ఒక కేటగిరి సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. దానివల్ల యూత్ ప్రేక్షకుల నుంచి ఆయనకు విశేషమైన ఆదరణ రావడం లేదు. దానివల్ల నందమూరి ఫ్యామిలీకి కొంతవరకు ప్రేక్షకుల నుంచి ఆదరణ తగ్గుతుందనే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం లవ్ స్టోరీలను చేయగలిగే కెపాసిటి ఉన్న హీరోలు నందమూరి ఫ్యామిలీలో ఎవ్వరు లేరు కాబట్టి మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి తీసుకొస్తే ఆ లోటు తీరిపోతుందని అనుకున్నప్పటికి ఆయన సినిమా ఇప్పటివరకు కార్యరూపం దాల్చడం లేదు.
ఇక మోక్షజ్ఞ కంటే ముందే మరో ఇద్దరు హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకరు జానకి రామ్ కొడుకు అయిన చిన్న ఎన్టీఆర్ కాగా, కళ్యాణ్ రామ్ కొడుకు సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీలైనంత తొందరగా కళ్యాణ్ రామ్ తన కొడుకుని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
వీళ్లిద్దరైన ఇండస్ట్రీ కి వస్తున్నారు. కానీ మోక్షజ్ఞ సినిమా మాత్రం ఇప్పటివరకు రావడం లేదు. అసలు అది ఫ్యూచర్ లో వస్తుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు… మరి ఎందుకని బాలయ్య మోక్షజ్ఞ సినిమా విషయంలో ఇంత డీలే చేస్తున్నాడు. మోక్షజ్ఞ కి సినిమా ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదా? ఒకవేళ బాలయ్యనే తన కొడుకుని వద్దని చెపుతున్నాడా అనే విషయాల్లో సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దర్శకుల మీద దర్శకులు మారుతున్నారు కానీ మోక్షజ్ఞ సినిమా మాత్రం కార్యరూపం దాల్చడం లేదంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య ఎలాగైనా సరే తన కొడుకుని ఇండస్ట్రీకి తీసుకువచ్చి టాప్ హీరోగా మారుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు అయితే నందమూరి ఫ్యామిలీ మూడోవతారం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ఫుల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎన్టీఆర్ ను మించి మోక్షజ్ఞ క్రేజ్ సంపాదిస్తే తప్ప నందమూరి ఫ్యామిలీ మూడోతరం వారసుడిగా మనం మోక్షజ్ఞ మారలేడు…