Animal: అర్జున్ రెడ్డి హిట్ కి కారణమైన ఆ 3 ఎలిమెంట్స్ అనిమల్ లో కూడా ఉన్నాయా..?

అర్జున్ రెడ్డి సినిమా హిట్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ గా మారడానికి ముఖ్యంగా మూడు ఎలిమెంట్స్ అనేవి కీలకపాత్ర వహించాయి. ఒకటి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ ని మనకి పరిచయం చేస్తూ ఆ క్యారెక్టర్ ఉన్న షేడ్స్ ని డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తూ ఆ క్యారెక్టర్ ని ప్రేక్షకులకు చాలావరకు దగ్గరయ్యేలా చేసి సక్సెస్ అయ్యారు.

Written By: Gopi, Updated On : November 24, 2023 6:41 pm

Animal

Follow us on

Animal: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మూస ధోరణి లో సాగుతున్న సినిమాలన్నింటినీ బ్రేక్ చేస్తూ సందీప్ రెడ్డి వంగ అని ఒక యంగ్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆ సినిమాలో వాడిన ప్రతి ఒక్కటి అంటే సౌండ్ గాని, ఎడిటింగ్ గాని, డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం గానీ అన్ని ఒక కొత్త ఓరవాడికి శ్రీకారం చుట్టాయి. శివ సినిమా తర్వాత ఆ రెంజ్ లో మొత్తం ఇండస్ట్రీ ని షేక్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాని తీసుకుపోయిన విధానమే అర్జున్ రెడ్డి సాధించిన విజయం కారణం…

ఇక అర్జున్ రెడ్డి సినిమా హిట్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ గా మారడానికి ముఖ్యంగా మూడు ఎలిమెంట్స్ అనేవి కీలకపాత్ర వహించాయి. ఒకటి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ ని మనకి పరిచయం చేస్తూ ఆ క్యారెక్టర్ ఉన్న షేడ్స్ ని డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తూ ఆ క్యారెక్టర్ ని ప్రేక్షకులకు చాలావరకు దగ్గరయ్యేలా చేసి సక్సెస్ అయ్యారు. సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాల్లోనే ఆ క్యారెక్టర్ ని ప్రేక్షకులు ఓన్ చేసుకొని చూడగలిగారు అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం లో డైరెక్టర్ కి ఎంత దమ్ము ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…

ఇంకో ఎలిమెంట్ ఏంటంటే లవ్… అగ్రేసివ్ గా కనిపించే ఒక వ్యక్తి ని కంట్రోల్ చేసేది ప్రేమే అని అర్థం చేసుకొని ఆ ప్రేమకి దాసోహం అయిపోయి తన కెరీర్ ని కూడా పక్కనపెట్టి ప్రేమ కోసమే బతుకుతూ ఉండే ఒక జెన్యూన్ ప్రేమికుడు పడే బాధని ఆ వేదనని డైరెక్టర్ కండ్లకు కట్టినట్టుగా చూపించాడు…ఇక మూడో ఎలిమెంట్ ఏంటంటే అప్పటివరకు సినిమా అంటే ఇలానే ఉండాలి అంటే ఇదే సౌండ్, ఇదే ఎడిటింగ్, ఇదే క్యారెక్టరైజేషన్ అనే వాటన్నిటికీ స్వస్తి పలుకుతూ ఆయన ఒక కొత్తదనానికి శ్రీకారం చుట్టాడు. ఈ మూడు ఎలిమెంట్స్ ఉండడం వల్లే అర్జున్ రెడ్డి జనాల్లోకి వెళ్ల గలిగింది అలాగే ఇది ఒక హిట్ నుంచి బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళిపోయింది.

ఈ సినిమా చూడగానే జనాలు కనెక్ట్ అయిపోయారు కాబట్టి సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక అనిమల్ సినిమాలో కూడా ఈ మ్యాజిక్ జరిగితేనే సినిమా అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది లేకపోతే ఎనిమల్ సినిమా ఒక నార్మల్ హిట్ సినిమా గానీ మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డిలో ఏవైతే ప్లస్ అయ్యయో అనిమల్ లో కూడా అవి గనక ప్లస్ అయితే అనిమల్ ఇండియా లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గా మిగిలిపోతుంది…