Mahesh Babu: టైర్ వన్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. కానీ రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మహేష్ బాబు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు… ఇక ఇదంతా చూస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం మహేష్ బాబు రేంజ్ మారబోతుంది అనే ఒక అంచనాలో ఉన్నారు. అయితే బాలీవుడ్ దర్శకులు కొందరు మహేష్ బాబుతో ఇప్పుడు సినిమాలు చేయడానికి అలాగే అతనికి కథలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారట. ఇక మరికొంతమంది మాత్రం మహేష్ బాబును పట్టించుకోవడంలేదనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా వారణాసి సినిమా వచ్చిన తర్వాత మాత్రం మహేష్ బాబు రేంజ్ అయితే తప్పకుండా మారిపోతుంది. ఆయన ఇండియాలోనే టాప్ హీరోగా మారిపోతాడు. ప్రేక్షకులను సైతం మెప్పించి వాళ్ల మన్ననలను పొందే కెపాసిటి కూడా మహేష్ బాబుకి ఉంది. కాబట్టి ఆయనకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ రాబోతుంది అనేది కూడా కీలకంగా మారబోతుంది.
ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన క్లారిటిని మెయింటైన్ చేస్తున్నప్పటికి పూర్తిగా ఆయన తన పంథా ను మార్చి రాబోయే సినిమాలతో డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక వారణాసి సినిమాలో 5 గెటప్పుల్లో నటిస్తున్న మహేష్ బాబు తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారట. మొత్తానికైతే మహేష్ బాబు నటనలో చాలా వైవిధ్యాన్ని చూపిస్తాడనే విషయం మనందరికి తెలిసిందే…
ఇక తను 5 గెటప్పుల్లో కనిపించడం ఉంటే మామూలు విషయం కాదు. రాజమౌళి దగ్గరుండి మరి తనకు కావాల్సినట్టుగా హీరోలతో నటింపజేస్తున్నాడు. కాబట్టి మహేష్ బాబు తో సైతం అలాంటి నటనను తీసుకువచ్చే ప్రయత్నంలో రాజమౌళి బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది… రాజమౌళి ఈ సినిమాతో సక్సెస్ ను సాధిస్తే తన రేంజ్ కూడా మారిపోతుంది. ప్రపంచ స్థాయిలో ఉన్న హీరోలందరు అతనితో నటించడానికి ఆసక్తి చూపిస్తారు…
