https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ వల్లే వారికి ఆఫర్లు రావడం లేదా? అభిమానులు అంగీకరించరా??

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరో.. మొదటి నుంచి ఇప్పటి వరకు తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 13, 2024 / 02:31 PM IST

    Are they not getting offers because of Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ఈయన అంటే ఒక బ్రాండ్. ఈయనంటే ఓ క్రేజ్. ఈయనిజం పవనిజం. ఇలా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవనుకుంట.. ఈయన సినిమాలు, నటన ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి ఆయన సినిమా వస్తుందనే వార్త వినిపిస్తే చాలు ఓ రేంజ్ లో ఎదురుచూస్తారు అభిమానులు. తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరో.. మొదటి నుంచి ఇప్పటి వరకు తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చారు.

    ఈయన నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ లను సొంతం చేసుకొని సాటి లేని హీరోగా నిలిచారు. ఆయన చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం వాటికి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో బిజీ అయ్యారు పవన్. ఏపీలో త్వరలోనే ఎన్నికలు ఉండడంతో ప్రస్తుతం రాజకీయాలకే పరిమితం అయ్యారు పవన్. పీక్స్ టైమ్ కాబట్టి కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు లేదా రెండింటిని బాలెన్స్ చేస్తూ తనదైన ముద్ర వేసుకుంటారు. ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ ఎన్నికల తర్వాత మొదలు అవుతాయట.

    అయితే పవన్ కళ్యాణ్ ను ఒకప్పుడు మీడియా ముఖంగా తిట్టిన వారికి ప్రస్తుతం అవకాశాలు లేకుండా పోయాయని టాక్. అందులో ముఖ్యంగా శ్రీ రెడ్డి, పోసాని మురళి కృష్ణలు మెయిన్ అని సమాచారం. వీళ్లిద్దరు కూడా పవన్ కళ్యాణ్ ను దుర్భషలాడుతూ మాట్లాడారు. దీని వల్లే ఈ ఇద్దరికి ఇండస్ట్రీలో సినిమాలు కరవయ్యాయి అంటారు. వీరిని సినిమాల్లో తీసుకోవడానికి ఏ దర్శకులు ఇష్టపడడం లేదట. దీనికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా తిడితే వారిని ఆయన అభిమానులు ఆక్సెప్ట్ చేయడం కష్టమే.

    ప్రేక్షకుల ఆగ్రహం తెలిసిన తర్వాత కూడా ఆయా యాక్టర్స్ ను తీసుకొని ఫ్లాప్ లను చవిచూడడం అవసరమా అనుకుంటారట దర్శకనిర్మాతలు. రిస్క్ చేసేకంటే వేరే బెస్ట్ అనుకుంటున్నారట. అందువల్లే ఈ ఇద్దరికి సినిమా అవకాశాలు రావడం లేదని టాక్. ఇక శ్రీ రెడ్డి యూట్యూబ్ కే అంకితమైతే.. పోసాని మాత్రం వైసిపి పార్టీలో మెంబర్ గా కొనసాగుతున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు కూడా తమ చేతులారా తమ సినీ కెరీర్ ను పోగొట్టుకున్నారని టాక్.