Movies : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తెలుగు సినిమా ఇండస్ట్రీ…ఎందుకు అంటే ప్రస్తుతం ఇండియాలో పెను సంచలనాలను సృష్టిస్తూ మనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేయడంలో మన హీరోలు దర్శకులు కీలకపాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే మన సినిమా ఇండస్ట్రీ అనేది పాన్ ఇండియాలో టాప్ ఇండస్ట్రీకి ఎదగడమే కాకుండా మనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మన హీరోలు సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు సినిమా హీరోలకి ఉన్న గుర్తింపు మరే హీరోలకు లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ ఇయర్ లో ఇప్పటికే హనుమాన్, కల్కి పుష్ప 2 లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో మన హవాను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్లాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ ఇయర్ ఎండింగ్ కి వచ్చేసింది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తంలో అన్ని సినిమాలను కలిపి ఆ సినిమాల్లోని ఏ సీన్ ను ఎక్కువమంది నెటిజన్లు ఇష్టపడ్డారనే విషయాలను తెలుసుకోవడానికి కొంతమంది ఆసక్తి చూపించారు. ఇక అందులో భాగంగానే ఎక్కువమంది కల్కి సినిమాలో కర్ణుడికి అర్జునుడికి మధ్య ఒక యుద్ధ సీన్ ఉంటుంది. ఆ సీను చూడడానికి చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపించారట. ఇక చాలామందికి ఆ సీను చాలా ఫేవరెట్ సీన్ గా మారిందని కూడా చెబుతూ ఉండటం విశేషం.
ఇక దీంతో పాటుగా మరి కొంతమంది హనుమాన్ సినిమా చివర్లో హనుమాన్ వచ్చే ఎపిసోడ్ బాగా నచ్చుతుందని చెబుతున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీన్ హైలెట్ గా ఉంటుందని చెబుతుండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిధి దాటి ముందుకు దూసుకెళ్తుంది.
కాబట్టి ఇప్పుడు మన హవాని ఆపడం ఎవ్వరి వల్ల కాదు… సినిమాలోని సీన్లు చాలా ఎక్స్ట్రాడినరీగా రాసుకోవడమే కాకుండా మన దర్శకులు ఒక్కో సీన్ లో భారీ ఎమోషన్ ఇచ్చే విధంగా సీన్లను మలుచుతున్నారు. తద్వారా సినిమాని విజువల్ గా చూసినప్పుడు ప్రేక్షకులందరూ గొప్ప అనుభూతికి లోనవ్వడేమే కాకుండా దర్శకులుగా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ల సత్తా చాటుతున్నారు…ఇక ఎప్పటికైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగిపోతుంది అంటూ చాలామంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం…
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మన వాళ్లకు పోటీ ఎదురైనా కూడా తట్టుకొని నిలబడగలిగే కెపాసిటిని సంపాదించుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మన వాళ్ల గురించి గొప్పగా చెబుతున్నారు…