USA Theatres: సినిమాల ప్రభావం సగటు ప్రేక్షకుల మీద సినిమాల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల కోసం వాళ్ళ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూసేవారు… ఇక ఒకసారి ఆ సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమాకు సంబంధించిన హంగామా అంత థియేటర్ దగ్గర తీర్చేసేవారు. మొత్తానికైతే ఒక సినిమా సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించిందంటే వెంటనే ఆ సినిమాకు విపరీతంగా ఎక్కువ సంఖ్యలు థియేటర్లను కేటాయిస్తూ ఆ సినిమాని సక్సెస్ ఫుల్ దిశగా ముందుకు తీసుకెళ్తుండటం విశేషం… ఇక ఇండియాలో మల్టీప్లెక్స్ రావడం వల్ల ఇలాంటి ఒక సంస్కృతి అయితే తగ్గిపోతోంది. ఇక ఇప్పుడు ఆ సంస్కృతి యూఎస్ఏ లో ఎక్కువగా పెరిగిపోతోంది…
యూఎస్ఏ లో ఇండియన్స్ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల మన సినిమాలు అక్కడ విడుదలవుతున్నాయి. తద్వారా అక్కడ ప్రేక్షకులను మెప్పించినట్టయితే వాళ్ల అభిమాన హీరో సినిమాలకి ఎందుకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించడం లేదంటూ వాళ్ళు తగాదాకు దిగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది అనేది కూడా థియేటర్ల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది.
Also Read: కల్కి 2′ లో దీపిక ప్లేస్ ను ఆ హీరోయిన్ తో రీప్లేస్ చేస్తున్నారా..?
ఎందుకంటే వివిధ భాషల నుంచి చాలా సినిమాలు యూఎస్ఏ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటన్నింటికి థియేటర్స్ ని కేటాయించాలి అంటే అక్కడ లిమిటెడ్ గాని థియేటర్లు ఉంటాయి. కాబట్టి వాటిని థియేటర్స్ ని కేటాయిస్తూ సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించిన థియేటర్ కి ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించాలంటే మాత్రం కొంతవరకు ఇబ్బంది కలిగించే అంశం అనే చెప్పాలి.
కాబట్టి సినిమా రిలీజ్ డేట్ అనేది ఇక్కడ కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. పెద్దగా సినిమాలు లేని సమయంలో రిలీజ్ చేసుకుంటే సక్సెస్ ఫుల్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం ఎక్కువ సంఖ్యలో థియేటర్లు కేటాయించే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదురవ్వచ్చు…తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అభిమానుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇక ఇప్పుడు యూఎస్ఏ లో అలాంటి కండిషన్స్ ఎదురవ్వడం అనేది యూఎస్ఏ లో మన సినిమాల ప్రభావం ఏ రేంజ్ లో ఉందో చెప్పకనే చెబుతోంది…