iPhone 17 Shocking Video: ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఇండియాలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 19, 2025న ముంబై బంద్రా–కుర్లా కాంప్లెక్స్ యాపిల్ స్టోర్ వద్ద అందుబాటులోకి వచ్చింది. అయితే ఫోన్ కోసం రాత్రి నుంచి లైన్లు పడుకున్న ఫ్యాన్స్ మధ్య ఉత్తేజం ఆకస్మిక కొట్టుకోవడాలుగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ షాకింగ్ ఘటనలు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి. ఇండియన్ ఐఫోన్ మార్కెట్ ప్రీమియం డిమాండ్‌ను మరింత హైలైట్ చేస్తున్నాయి.
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్..
ఆపిల్ సెప్టెంబర్ 9న ప్రకటించిన ఐఫోన్ 17 సిరీస్‌లో iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, కొత్త iPhone Air మోడల్స్ ఉన్నాయి. ఇండియాలో ధరలు రూ.82,900 నుంచి రూ.2,29,900 వరకు ఉన్నాయి, ఇది మునుపటి మోడల్స్‌తో సమానంగా ఉంది. కీ ఫీచర్లలో అధునాతన ఏఐ ఇంటిగ్రేషన్, మెరుగైన కెమెరాలు, లాంగ్–లాస్టింగ్ బ్యాటరీలు, కాస్మిక్ ఆరెంజ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇండియాలో ప్రీ–ఆర్డర్లు రికార్డ్ స్థాయిలో జరిగాయి, ముఖ్యంగా Proట మోడల్స్ కొత్త కలర్‌లు త్వరగా స్టాక్ అవుట్ అయ్యాయి. ఈ లాంచ్ ఇండియాలో ఆపిల్‌కు మరో మైలురాయి. ఢిల్లీ సాకెట్, ముంబై బీకేసీ, బెంగళూరు స్టోర్ల వద్ద రాత్రి 3 గంటల నుంచి క్యూలు పడ్డాయి. ముంబై బీకేసీ స్టోర్ వద్ద రాత్రి నుంచి లైన్లు ఏర్పడటం, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కస్టమర్లు క్యాంప్ చేయడం ఆపిల్ ఫోన్లపై భారతీయుల పిచ్చికి అద్దం పడుతున్నాయి.
ముంబైలో కొట్టుకున్న ఐఫోన్ లవర్స్..
ఉదయం 5 గంటలకు ముంబై బీకేసీ జియో వరల్డ్ డ్రైవ్ స్టోర్ వద్ద వందలాది మంది క్యూలో నిలిచారు. స్టోర్ తెరవగానే ఉత్సాహం ఎక్కువ కావడంతో కొంతమంది మధ్య గొడవ మొదలై అది క్రమంగా కొట్టుకునే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని, లైన్లను కట్టుబడి నిర్వహించారు. ఢిల్లీ సాకెట్ స్టోర్ వద్ద కూడా భారీగా ఐఫోన్ లవర్స్ బారులు తీరారు. కానీ ముంబైలోని ఘటన ఎక్కువ ఆకర్షణ పొందింది. కస్టమర్లు ‘కాస్మిక్ ఆరెంజ్ Pro Max కోసం రాత్రి 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారని, కెమెరా, డిజైన్ మార్పులు ఆకర్షించాయని చెప్పుకున్నారు.
ఇండియాలో ఎందుకి ఇంత క్రేజ్
ఇండియాలో ఐఫోన్ డిమాండ్ ఎందుకు ఇంత ఎక్కువ? ముందుగా, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గత ఐదేళ్లలో 25% వృద్ధి చెందింది. ఆపిల్ దీనిలో 60% షేర్ పొందింది. యువతలో స్టేటస్ సింబల్‌గా మారిన ఐఫోన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల మార్కెటింగ్ వల్ల ఎక్కువ ఆకర్షణ పొందుతోంది. ఇండియాలో ఆపిల్ స్టోర్లు (2023లో ఓపెన్ అయినవి) ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నాయి, ఇది లాంచ్ డేను ఈవెంట్‌గా మార్చింది. ఆర్థికంగా, మధ్యతరగతి ఆదాయం పెరగడం, ఈఎంఐ ఆప్షన్లు, ట్రేడ్–ఇన్ స్కీమ్‌లు ఖరీదైన డివైస్‌లను సులభం చేస్తున్నాయి. అయితే, ఈ క్రేజ్ విమర్శలు కూడా ఉన్నాయి – హై ప్రైస్ డెస్పైట్ లోకల్ మాన్యుఫాక్చరింగ్, ‘ఆక్సిజన్ వేర్‘ అనే ట్రోల్స్. ముంబై ఘటన ఈ క్రేజ్‌ను ‘షాకింగ్‘గా చూపిస్తూ, భవిష్యత్ లాంచ్‌లలో మరిన్ని మేనేజ్‌మెంట్ చర్యలు అవసరమని సూచిస్తోంది.
ఐఫోన్ 17 కోసం క్యూ లైన్లో బార్లు తీరిన ఐఫోన్ లవర్స్
ఇండియాలో ఐఫోన్ 17 సిరీస్ 4 అధికారిక స్టోరుల్లో అందుబాటులోకి వచ్చాయి.
ముంబై BKC లోని యాపిల్ స్టార్ వద్ద క్యూ లైన్లో నిలబడ్డ ఐఫోన్ ప్రియులు#iPhone17 #Mumbai pic.twitter.com/vpUA0fMrvz
— greatandhra (@greatandhranews) September 19, 2025