https://oktelugu.com/

Trisha-Vijay: త్రిష పరాన్నజీవి, విజయ్ జీవితంలోకి ప్రవేశించింది? స్టార్ సింగర్ సెన్సేషనల్ కామెంట్స్!

Trisha-Vijay: లిఫ్ట్ లో రహస్యంగా తీసిన ఫోటో త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అది చర్చకు దారి తీసింది. త్రిషకు కావాల్సింది అలాంటి పబ్లిసిటీనే.

Written By: , Updated On : July 2, 2024 / 11:37 AM IST
Thalapathy Vijay and Trisha Krishnan dating

Thalapathy Vijay and Trisha Krishnan dating

Follow us on

Trisha-Vijay: హీరోయిన్ త్రిష, హీరో విజయ్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో స్టార్ సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. విజయ్ జీవితంలోకి త్రిష ప్రవేశించారని, ఆమె ఒక పరాన్నజీవి అని సుచిత్ర అన్నారు. సుచిత్ర మాట్లాడుతూ… విజయ్ తన భార్య సంగీతతో ఎప్పుడో కలవాల్సింది. అహంభావం, గొడవలు వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. అదే సమయంలో త్రిష వంటి పరాన్నజీవి ఇతరుల జీవితంలోకి ప్రవేశిస్తుంది.

లిఫ్ట్ లో రహస్యంగా తీసిన ఫోటో త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అది చర్చకు దారి తీసింది. త్రిషకు కావాల్సింది అలాంటి పబ్లిసిటీనే. విజయ్ జీవితంలో త్రిష ఉండాలని అనుకుంటున్నారు. అందుకే విజయ్-త్రిషలను ఎంజీఆర్-జయలలితతో జనాలు పోలుస్తున్నారు. ఎంజీఆర్ జీవితంలో జయలలిత పరాన్నజీవి. తన స్నేహితుడి జీవితం నాశనమైపోవడంతో కరుణానిధి తాత వేదన చెందాడు.

ఎంజీఆర్ కారణంగా జయలలిత రాజకీయాల్లో ఎదిగింది. తర్వాత ఆయన్ని విస్మరించింది. అయితే జయలలిత రాజకీయాల్లో తన మార్క్ వేశారు. ప్రజలకు మేలు చేశారని… అన్నారు. సుచిత్ర కామెంట్స్ సంచలనంగా మారాయి. కాగా సుచి లీక్స్ పేరుతో సింగర్ సుచిత్ర గతంలో కోలీవుడ్ సెలెబ్స్ ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్, ఆండ్రియా, త్రిష, రానాతో పాటు పలువురు తమిళ చిత్ర ప్రముఖుల రహస్య ఫోటోలు సుచిత్ర లీక్ చేసింది.

మరోవైపు విజయ్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఆయన చివరి చిత్రం గోట్. తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం కానున్నట్లు విజయ్ ప్రకటించారు. కొత్త పార్టీ ప్రకటించిన విజయ్ సంస్థాగతంగా బలపడే పనిలో నిమగ్నం అయ్యారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయనుంది. అదే సమయంలో హీరోయిన్ త్రిషతో ఆయన ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నాడు. విజయ్ గత చిత్రం లియో చిత్రంలో విజయ్ కి జంటగా త్రిష నటించారు.