Aadhaar Card: పౌర సేవలకు, సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి. ప్రభుత్వపరంగా ప్రతి అంశానికి ఆధార్ ను తప్పనిసరి చేశారు. అందుకే ఆధార్ లో సమగ్ర వివరాలు పొందుపరచుకుంటే మంచిది. లేకుంటే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే ఆధార్ లో తప్పిదాలను సరి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అప్డేట్ కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగు రోజులు పాటు ఈ కేంద్రాలు కొనసాగనున్నాయి.
భారత పౌరుడిగా ధ్రువీకరించేందుకు ఆధార్ కార్డు ముఖ్యం. ఈ కార్డు ద్వారా మీ వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటేనే మీకు ప్రభుత్వ సేవలు అంది అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, సేవలు పొందాలనుకుంటే ఆధార్లో వివరాలు సరైనవి ఉండాలి. అవి తప్పుగా ఉంటే మీకు సేవలు అందకపోవచ్చు. అందుకే ఇటువంటి వారి కోసం ప్రభుత్వం అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 23 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కేంద్రాలు పని చేయనున్నాయి. ఆధార్ కార్డులో వివరాలు మార్చాల్సిన వారు, కొత్తగా వివరాలు పొందుపరచాల్సిన వారు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చు.
ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇటువంటి వారు రాష్ట్రంలో 1.49 కోట్ల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరికోసమే ఈ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధార్ కార్డులో పేరు తప్పుగా వచ్చినా, ఫోటో మారినా, ఫోన్ నెంబర్లు, చిరునామా మార్చుకోవాలన్నా ఇప్పుడు అరుదైన అవకాశం. అప్డేషన్ కేంద్రాలు గ్రామాల్లోని ఏర్పాటు చేయడంతో ఇట్టే మార్పు చేసుకోవచ్చు. ఎటువంటి వ్యయ ప్రయాసలు ఓర్చుకోనవసరం లేదు. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనెల 23 వరకు ఛాన్స్ ఉంది.