Indian Movies: ఇక మీదట మన సినిమా స్టోరీలు రామాయణ మహాభారతాలేనా..?

Indian Movies: ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి లాంటి దర్శకుడు సైతం మన మహాభారతం, రామాయణాలను మించిన ఎమోషనల్ స్టోరీ మరొకటి ఉండదు అని చాలా సార్లు చెప్పాడు.

Written By: Chai Muchhata, Updated On : June 29, 2024 12:34 pm

Are our movie stories based on Ramayana and Mahabharata

Follow us on

Indian Movies: ప్రస్తుతం సినిమా దర్శకులందరు పురాణాల మీదనే ఆధారపడి సినిమాలను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు కమర్షియల్ స్టోరీలు బీభత్సమైన హైప్ ని క్రియేట్ చేసుకునేవి. కానీ ఇప్పుడు పురాణాలను బేస్ చేసుకొని గ్రాఫికల్ ఓరియెంటెడ్ గా సినిమాలను తీసి సక్సెస్ లను సాధిస్తున్న దర్శకులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇక ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి లాంటి దర్శకుడు సైతం మన మహాభారతం, రామాయణాలను మించిన ఎమోషనల్ స్టోరీ మరొకటి ఉండదు అని చాలా సార్లు చెప్పాడు.

ఇక దాన్ని బేస్ చేసుకొని చాలా మంది సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయని తను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక తను అనుకున్నట్టుగానే యంగ్ డైరెక్టర్స్ అలాగే స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా పురాణాల మీదనే ఆధారపడి సినిమాలు చేస్తున్నారు… ఇక అది చూడడానికి ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మన పురాణ గాధల్లో ఎమోషన్ గాని, ఎలివేషన్ గాని చాలా పీక్ స్టేజ్ లో ఉంటుంది దాన్ని మించిన డ్రమటికల్ స్టోరీ మరొకటి ఉండదనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా మహాభారతాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమానే కావడం విశేషం…ఇక ఈ సినిమా ఇప్పుడు 1000 కోట్లు సాధించే దిశగా ముందుకు సాగుతుంది…

ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న హనుమాన్ సినిమా స్టోరీ కూడా హనుమంతుడి వీరత్వాన్ని చూపించడం మీదనే డిపెండ్ అయి తీశారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా కూడా రాబోతుంది. ఇలా యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా పురాణాలను బేస్ చేసుకొని సినిమాలు చేయడం ఒకంతుకు మంచి విషయమనే చెప్పాలి. ఎందుకంటే మన జనరేషన్ లో చాలామందికి పురాణాల మీద అవగాహన లేదు. దేవుడంటే నమ్మకం లేదు.

కాబట్టి ఇలాంటి సినిమాల ద్వారా అయిన ప్రేక్షకుల్లో దేవుడి మీద నమ్మకం ఏర్పడడం గానీ, మన లైఫ్ ఎటువైపు వెళుతుంది మనిషి ఎలా బతకాలి అనే ఒక నీతి నియమాలను మర్చిపోయి బ్రతుకుతున్న మనుషులకు మరోసారి మనం ఎలా ఉండాలి అనే నియమాలను గుర్తు చేస్తాయి…ఇక బాలీవుడ్ దర్శకుడు ఆయన నితిష్ తివారీ కూడా ప్రస్తుతం ‘రామాయణం’ సినిమా చేస్తున్నాడు. ఇక ఇంతకుముందు ‘దంగల్ ‘ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు రామాయణం చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

ఇక దానికోసమే రన్బీర్ కపూర్, సాయి పల్లవి లను రాముడు సీతగా ఎంచుకొని తను మంచి పని చేశాడు అంటూ మరికొంతమంది విమర్శకులు సైతం ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఇక గత సంవత్సరం ఓం రావత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఆది పురుషు ‘ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించినప్పటికీ రామాయణాన్ని బేస్ చేసుకొని వచ్చింది. అయితే చన మంది ఈ సినిమాను విమర్శించినప్పటికి ఇక మంచి అటెంప్ట్ గా మిగిలిపోయింది…