https://oktelugu.com/

Movies: మన దర్శకులు పురాణాలను తప్పు దోవ పట్టిస్తూ సినిమాలను తీస్తున్నారా..?

Movies: దర్శకులు మాత్రం ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని సినిమా స్టోరీలను చాలా వైల్డ్ గా రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే మహాభారతాన్ని బేస్ చేసుకొని ఫిక్షన్ కథలను రాసి...

Written By:
  • Gopi
  • , Updated On : June 29, 2024 12:46 pm
    directors misrepresenting myths

    directors misrepresenting myths

    Follow us on

    Movies: ఒక సినిమా అనేది ప్రేక్షకుడి లో ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందో మనందరి తెలిసిందే.. కొన్ని సినిమాలు చూసి కొంతమంది మంచిగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. చెడ్డ దారిలో వెళ్లిన వారు ఉన్నారు. కాబట్టి సినిమా అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తీయాలి అందులోని హీరోల క్యారెక్టర్స్ గాని, హీరోయిన్స్ ని చూపించే విధానం గాని వాళ్ళ పరిమితులు దాటకుండా ఉండే విధంగా ఉంటే మంచిదని చాలామంది విమర్శకులు సినిమా దర్శకులను హెచ్చరిస్తూ ఉంటారు.

    కానీ దర్శకులు మాత్రం ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని సినిమా స్టోరీలను చాలా వైల్డ్ గా రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే మహాభారతాన్ని బేస్ చేసుకొని ఫిక్షన్ కథలను రాసి వాళ్లకు నచ్చిన క్యారెక్టర్స్ ని నచ్చిన విధంగా డిజైన్ చేసి చూపిస్తున్నారు అంటూ కొన్ని విమర్శలైతే వస్తున్నాయి… అంటే మన హీరో ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ గొప్ప అనే రేంజ్ లో మన అభిమానులు కూడా ఊహించేసుకుంటున్నారు. నిజానికి ఈ సంఘటనలు ఇప్పటినుంచి జరిగినవి కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్ హీరోగా ఉన్నప్పుడు ఆయన దుర్యోధనుడి పాత్ర వేస్తే ఆయన గొప్పవాడు అని,కర్ణుడుగా నటిస్తే కర్ణుడు గొప్పవాడని అనేవారు.

    అలా రాముడు, కృష్ణుడు ఆయన ఏ క్యారెక్టర్ వేసిన ఆ క్యారెక్టర్ ను హైలైట్ చేసి చూపిస్తూ ఉండేవారు. అంటే ఇక్కడ జరిగిన వాస్తవాన్ని పక్కనపెట్టి దర్శకులు ఆ హీరోల క్యారెక్టర్లకి న్యాయం చేయడానికి మాత్రమే ఆ పాత్రలను బాగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి కర్ణుడు దుర్యోధనుడు అనే ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయినప్పటికీ మహాభారతం లో ‘కురుక్షేత్రం ‘ జరగడంలో వీళ్ళిద్దరూ కీలకపాత్ర వహించారు.

    దుర్యోధనుడి పక్కనే ఉన్న కర్ణుడు అతన్ని ఆపొచ్చు కానీ ఆపలేదు. దానివల్లే సమస్త ప్రాణహాని జరిగిందని చాలామంది చెబుతుంటారు. కానీ ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి స్నేహాన్ని చాలా గొప్పగా చూపించే సినిమాలను కూడా చేశారు. మరి ఇలాంటివి చేసి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు అంటూ కొంతమంది సినీ విమర్శకులు సైతం ఆయా సినిమాల దర్శకుల మీద విమర్శలను గుప్పిస్తున్నారు…