Bigg Boss Telugu 8: మణికంఠ ఎలిమినేషన్ తో ‘బిగ్ బాస్ 8’ కి మంచి రోజులు రానున్నాయా..? ఇతని వల్ల రేటింగ్స్ ఆ రేంజ్ లో పడిపోయిందా?

ప్రతీ విషయాన్నీ ఓవర్ గా ఆలోచించడం, డ్రామా క్రియేట్ చేయడం, దాని వల్ల జనాల్లో ఇతనికి సానుభూతి పెరగడం, తద్వారా ఓట్లు రావడం అనేది ముమ్మాటికీ కరెక్ట్ కాదు. మణికంఠ గేమ్స్ బాగా ఆడుతూ, ఇలాంటి ఎమోషన్స్ ని కూడా కొనసాగిస్తే కచ్చితంగా అతను విన్నర్ మెటీరియల్, హౌస్ లో ఉండేందుకు అర్హుడు అని చెప్పొచ్చు .

Written By: Vicky, Updated On : October 20, 2024 10:45 am

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8:  ఈ సీజన్ కచ్చితంగా టాప్ 3 లో ఉంటాడు అనుకున్న మణికంఠ, అకస్మాత్తుగా ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. మణికంఠ కి టేస్టీ తేజ, పృథ్వి రాజ్ శెట్టి, హరితేజ కంటే తక్కువ ఓట్లు పడ్డాయా అనేది నమ్మలేకపొతున్నారు జనాలు. ఈ వారం ఆయన ఆట ఏమి లేదు, పలు సందర్భాలలో అతి డ్రామా చేసాడు అనే విషయం జనాలకు అర్థం అయ్యింది, కచ్చితంగా ఆయన గ్రాఫ్ తగ్గింది అనేది వాస్తవం, కానీ ఎలిమినేట్ అయ్యేంత మాత్రం కాదు. ఇదంతా పక్కన పెడితే పక్కన పెడితే , మణికంఠ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడమే కరెక్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు.
ఎందుకంటే అతను నిజంగానే మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేది రీసెంట్ గా చూసిన కొన్ని ఎపిసోడ్స్ ని చూస్తే అర్థం అవుతుంది.

ప్రతీ విషయాన్నీ ఓవర్ గా ఆలోచించడం, డ్రామా క్రియేట్ చేయడం, దాని వల్ల జనాల్లో ఇతనికి సానుభూతి పెరగడం, తద్వారా ఓట్లు రావడం అనేది ముమ్మాటికీ కరెక్ట్ కాదు. మణికంఠ గేమ్స్ బాగా ఆడుతూ, ఇలాంటి ఎమోషన్స్ ని కూడా కొనసాగిస్తే కచ్చితంగా అతను విన్నర్ మెటీరియల్, హౌస్ లో ఉండేందుకు అర్హుడు అని చెప్పొచ్చు . కానీ గేమ్స్ ఆడకుండా, కేవలం డ్రామాతోనే నెట్టుకొని రావాలంటే కుదరదు,అవి నిజంగానే అతని ఎమోషన్స్ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ కి ఇలాంటోళ్ళు పనికిరారు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లోపలకు వచ్చిన తర్వాత, మణికంఠ కి బయట సానుభూతి బాగా వర్కౌట్ అవుతుంది అనే విషయం హౌస్ మేట్స్ కి అర్థమైంది. అప్పటి నుండి హౌస్ మేట్స్ మొత్తం అతన్ని ఏమి అనలేకపోతున్నారు.

దీని వల్ల రియాలిటీ అనేది బయటపడడం లేదు, రియాలిటీ షోలో రియాలిటీ పూర్తిగా మిస్ అయ్యింది. అందువల్ల రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. గత సీజన్ లో మామూలు ఎపిసోడ్స్ కి 7 నుండి 8 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చేవి, అలాగే వీకెండ్ ఎపిసోడ్స్ కి మాత్రం 10 నుండి 12 రేటింగ్స్ వచ్చేవి. ఒక్కోసారి 15 కి పైగా రేటింగ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది గత సీజన్. కానీ ఈ సీజన్ లో మొదటి వారానికి మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి కానీ, రెండవ వారం నుండి రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. వీక్ ఎపిసోడ్స్ కి కేవలం 4 నుండి 5 రేటింగ్స్, అలాగే వీకెండ్ ఎపిసోడ్స్ కి 7 నుండి 8 రేటింగ్స్ మాత్రమే వస్తున్నాయి అంట. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత రేటింగ్స్ పెరుగుతాయేమో అనుకుంటే, ఇంకా తగ్గిపోయిందట. అందుకే మణికంఠ ని ఎలిమినేట్ చెయ్యాలని టీం మొత్తం నిర్ణయం తీసుకొని, అతన్ని బిగ్ బాస్ హౌస్ నుండి తొలగించినట్టు చెప్తున్నారు విశ్లేషకులు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఇక నుండి బిగ్ బాస్ సీజన్ 8 లో మంచి రోజులు రానున్నాయి, ఎందుకంటే డ్రామా కి స్పేస్ లేదు, కేవలం టాస్కులు మాత్రమే హోరాహోరీగా ఉంటాయి.