Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్’ హిస్టరీ లోనే అతి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ గా మణికంఠ..7 వారాలకు ఎంతో తెలుసా?

వ్వరూ ఊహించని విధంగా ఆయన నిన్న ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి టెలికాస్ట్ కానుంది. అయితే 7 వారాలు మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు గానూ, కేవలం 7 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం స్వయంగా మణికంఠ నే తన నోటితో చెప్పుకొచ్చాడు.

Written By: Vicky, Updated On : October 20, 2024 10:49 am

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8:  ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన సెలబ్రిటీస్ అందరికీ బిగ్ బాస్ మంచి రెమ్యూనరేషన్స్ అందించాడు. ప్రతీ ఒక్కరికి వారానికి రెండు లక్షలకు పైగా ఇచ్చాడు. సగం బడ్జెట్ ఇక్కడే అయిపోయింది. అంతే కాకుండా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి అయితే ఒక్కొక్కరికి వారానికి 4 లక్షల రూపాయిల చొప్పున రెమ్యూనరేషన్స్ ఇచ్చి బిగ్ బాస్ లోకి తెచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా అవినాష్, రోహిణి, హరితేజ వంటి వారు ఇండస్ట్రీ లో మంచి బిజీ ఆర్టిస్ట్స్ గా కొనసాగుతున్నారు. అలాంటోళ్లను హౌస్ లోకి తీసుకొచ్చారంటే ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారో ఊహించుకోవచ్చు. అయితే ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో కచ్చితంగా ఉంటాడని భావించిన మణికంఠ కి మాత్రం చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన నిన్న ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి టెలికాస్ట్ కానుంది. అయితే 7 వారాలు మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు గానూ, కేవలం 7 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం స్వయంగా మణికంఠ నే తన నోటితో చెప్పుకొచ్చాడు. గంగవ్వతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఆయన తన రెమ్యూనరేషన్ ని ఫ్లో లో బయటపెట్టేసాడు. ఈ 7 లక్షలు కూడా మణికంఠ కి పూర్తిగా రాదు, ఇందులో 20 శాతం కి పైగా జీఎస్టీ , మరియు ఇతర టాక్సులు కూడా పడుతాయి. అవన్నీ కట్ అవ్వగా, మణికంఠ చేతికి కేవలం నాలుగు లక్షల రూపాయిలు మాత్రమే వస్తాయి. ఈ మాత్రం సంపాదన కోసం ఆయన బిగ్ బాస్ హౌస్ కి రావడం ఎందుకు, బయట సీరియల్స్ చేసుకున్నా వచ్చేది కదా అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ అంటున్నారు.

బిగ్ బాస్ కి వచ్చింది కేవలం డబ్బులు సంపాదించడం కోసమే అని మణికంఠ అనేక సందర్భాల్లో చెప్పాడు. తన భార్య దగ్గర విలువ ఉండాలంటే డబ్బులు సంపాదించాలని, కాబట్టి ఈ గేమ్ బలంగా ఆడి గెలవాలని ఆయన చెప్పుకొచ్చాడు. హౌస్ లో కొనసాగి ఉండుంటే, టాప్ 5 వరకు వెళ్లి ఉంటే, కచ్చితంగా భారీ మొత్తంలోనే డబ్బులు సంపాదించి ఉండేవాడేమో కానీ, తన అంతట తానే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోవాలని కోరుకున్నాడు కాబట్టి, ఇక చేసేదేమి లేదని అంటున్నారు నెటిజెన్స్. అయితే బిగ్ బాస్ హౌస్ 7 వారాలు కేవలం మణికంఠ చుట్టూ తిరిగింది అని చెప్పొచ్చు. పల్లవి ప్రశాంత్ తర్వాత ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి ప్రభావం చూపించిన కంటెస్టెంట్ మరొకరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కచ్చితంగా ఈ షో ద్వారా మణికంఠ లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు, కాబట్టి బయటకి వెళ్లిన తర్వాత ఆయనకు మంచి ఆఫర్స్ వస్తాయని, ఆయన కెరీర్ బాగుపడుతుందని ఆశిద్దాం.