https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్ : సూపర్ స్టార్ కి విలన్ గా క్లాస్ హీరో !

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’లో విలన్ గా మొదట కన్నడ హీరో ఉపేంద్రను అనుకున్నారు. ఉపేంద్ర అయితే బాగుంటుందని మహేష్ కూడా ఫీల్ అయ్యాడు. ఎలాగూ ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించాడు కాబట్టి.. మహేష్ సినిమాలో కూడా విలన్ గా నటించడానికి ఆ కన్నడ స్టార్ హీరో ఒప్పుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ స్టార్ హీరోగా […]

Written By:
  • admin
  • , Updated On : September 27, 2020 / 07:33 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’లో విలన్ గా మొదట కన్నడ హీరో ఉపేంద్రను అనుకున్నారు. ఉపేంద్ర అయితే బాగుంటుందని మహేష్ కూడా ఫీల్ అయ్యాడు. ఎలాగూ ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించాడు కాబట్టి.. మహేష్ సినిమాలో కూడా విలన్ గా నటించడానికి ఆ కన్నడ స్టార్ హీరో ఒప్పుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ స్టార్ హీరోగా కొనసాగుతున్న నేను, విలన్ గా చేయడం ఏమిటి.. సారీ అంటూ ఉపేంద్ర మొత్తానికి మహేష్ సినిమాని అంగీకరించలేదు. అయితే విలన్ పాత్ర అయినప్పటికీ, ఆ పాత్ర సినిమాలోనే కీలకమైనది. అందుకే కచ్చితంగా స్టార్ డమ్ ఉన్న ఆర్టిస్ట్ మాత్రమే ఆ పాత్రలో నటించాలట.

    Also Read: కేకలు పెట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌..

    మరి విలన్ గా చేయడానికి ఎవరు అంగీకరిస్తారా అనుకుంటున్న సమయంలో తమిళ్ మాజీ హీరో అరవింద స్వామి ఆ పాత్ర చేయడానికి అంగీకరించాడట. ఎలాగూ అరవింద స్వామికి తెలుగులో కూడా క్రేజ్ ఉంది కాబట్టి.. అటు తమిళ ఇటు తెలుగు కూడా బాగానే గిట్టుబాటు అవుతుందని మేకర్స్ కూడా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి మహేష్ కి విలన్ గా క్లాస్ హీరో అరవింద స్వామి ఫిక్స్ అవ్వబోతున్నాడు. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాలకు, సామాజిక అంశాన్ని జోడించి.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమాని తియ్యటానికి పరుశురామ్ ప్లాన్ చేస్తున్నాడు.

    Also Read: సంచలన సీక్రెట్ చెప్పిన హీరోయిన్ రష్మిక మందన్న

    మరి పరుశురామ్ జీవతంలో వచ్చిన మొదటి పెద్ద ఛాన్స్ ఇది.. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ లవ్ ట్రాక్‌ కూడా ఉందని.. ఆ ట్రాక్ లో మహేష్ బాబు లవర్ బాయ్‌ గా నటించబోతున్నాడని తెలుస్తోంది. మేకర్స్ కూడా తమ సినిమాలో అద్భుతమైన లవ్ ట్రాక్ ఉందనే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయకురాలిగా కీర్తి సురేష్ నటించబోతుందని ఇటివలే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్ళీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని అన్నారు. మరి కీర్తి, కియారాలో, సూపర్ స్టార్ పక్కన ఎవరు రొమాన్స్ చేయనున్నారో చూడాలి.