https://oktelugu.com/

వామ్మో… బిగ్ బాస్ టీం గంగవ్వతో కాంట్రాక్ట్ కుదుర్చుకుందా..?

తెలుగులో ఏ రియాలిటీ షోకు లేని క్రేజ్ బిగ్ బాస్ షోకు ఉంది. బడ్జెట్ విషయంలో, సెలబ్రిటీల ఎంపిక విషయంలో కానీ, హోస్ట్ విషయంలో కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ఏ మాత్రం రాజీ పడరు. అందువల్లే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 సక్సెస్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ఏ సీజన్ అందుకోని స్థాయిలో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ను అందుకుంది. ఈ సీజన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 27, 2020 / 07:40 PM IST
    Follow us on

    gangavva

    తెలుగులో ఏ రియాలిటీ షోకు లేని క్రేజ్ బిగ్ బాస్ షోకు ఉంది. బడ్జెట్ విషయంలో, సెలబ్రిటీల ఎంపిక విషయంలో కానీ, హోస్ట్ విషయంలో కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ఏ మాత్రం రాజీ పడరు. అందువల్లే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 సక్సెస్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ఏ సీజన్ అందుకోని స్థాయిలో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ను అందుకుంది.

    ఈ సీజన్ లోని కంటెస్టెంట్లలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా..? అంటే గంగవ్వ మాత్రమే అని చెప్పాలి. బిగ్ బాస్ షోలో గంగవ్వ పాల్గొందని తెలిసిన వెంటనే ఆమె పేరిట సోషల్ మీడియాలో ఆర్మీలు వెలిశాయి. ప్రేక్షకుల్లో చాలామంది గంగవ్వ కోసం బిగ్ బాస్ షో చూస్తామని సోషల్ మీడియాలో కామంట్లు చేశారు. మరి కొందరు గంగవ్వను గెలిపించడమే లక్ష్యంగా కష్టపడతామని అన్నారు.

    రెండో వారంలో రెండు మూడు రోజులు తనకు బిగ్ బాస్ హౌస్ నచ్చడం లేదని.. అక్కడ ఉండాలనిపించడం లేదని చెప్పిన గంగవ్వ మళ్లీ షోలో యాక్టివ్ గా ఉంటూ ఇతర కంటెస్టెంట్లపై కౌంటర్లు వేస్తోంది. కొందరు గంగవ్వ వల్ల టాస్క్ ల విషయంలో ఇతర కంటెస్టెంట్లు నష్టపోతున్నారని కామెంట్లు చేస్తున్నా ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆమెను ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ప్రత్యేకంగానే చూడాల్సి వస్తోంది.

    ఆరు పదుల వయస్సు ఉన్న గంగవ్వ టాస్క్ గెలిచి కెప్టెన్ అయింది. తాజాగా ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఖచ్చితంగా రెండు నెలలు ఉంటుందని… ఇల్లు కొనాలనే లక్ష్యంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందని అన్నారు. గంగవ్వ కూడా మాస్క్ వేసుకుని గేమ్ ఆడుతుందని చెప్పారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వతో రెండు నెలలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాఅని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.