https://oktelugu.com/

Balayya : హీరోయిన్ గా బాలయ్య కూతురు బ్రాహ్మణి.. ‘అన్ స్టాపబుల్’ షోలో బాలయ్య సంచలన ప్రకటన!

నందమూరి బాలకృష్ణ కి తన ఇద్దరు కూతుర్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం అవసరం లేదు. చిన్నప్పటి నుండి వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా, ఎంతో గారాబంగా పెంచాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 4, 2025 / 07:55 AM IST

    Balayya's daughter Brahmani

    Follow us on

    Balayya : నందమూరి బాలకృష్ణ కి తన ఇద్దరు కూతుర్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం అవసరం లేదు. చిన్నప్పటి నుండి వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా, ఎంతో గారాబంగా పెంచాడు. పెద్దయ్యాక వాళ్లకు అద్భుతమైన సంబంధాలను చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపాడు. ఈరోజు వాళ్లిద్దరూ ఎంతటి సంతోషవంతమైన జీవితాలను గడుపుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ ఆడబిడ్డకు బాలయ్య లాంటి తండ్రి ఉంటే ఎంత బాగుండునో అని బ్రాహ్మణి, తేజస్వినిలను చూసినప్పుడు అర్థం అవుతుంది. వీళ్లిద్దరు కూడా బాలయ్య ని ఎంతగానో ప్రేమిస్తారు. ముఖ్యంగా తేజస్విని అయితే బాలయ్య కెరీర్ ని సెకండ్ ఇన్నింగ్స్ ఎలా మార్చి చూపిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాలన్నీ ఆమె సెలెక్ట్ చేసినవే అవ్వడం విశేషం. ఆహా మీడియా లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘అన్ స్టాపబుల్’ ప్రోగ్రాం ని డిజైన్ చేసింది కూడా ఈమెనే.

    ఇదంతా పక్కన పెడితే పెద్ద కూతురు బ్రాహ్మణి ఇప్పటి తరం హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు. నందమూరి కుటుంబం మొత్తం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది కదా, ఇంత అందం పెట్టుకొని బ్రాహ్మణి ఎందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అనే సందేహం అభిమానుల్లో ఎప్పటి నుండో ఉంది. ఆ సందేహాలకు బాలయ్య నిన్న అన్ స్టాపబుల్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో సమాధానం ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘బ్రాహ్మణి ని హీరోయిన్ ని చెయ్యాలనే కోరిక నాలో చాలా ఉండేది. ఆమెని సినిమాల్లో నటించమని ఎన్నోసార్లు అడిగాను కూడా. కానీ ఆమె నాకు ఇష్టం లేదు అంటూ రిజెక్ట్ చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య. రెండవ కూతురు తేజస్విని కూడా చాలా తెలివైన అమ్మాయి అని, ఆమెకు కూడా సినిమాల మీద ఆసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

    సినీ రంగం మీద వాళ్ళిద్దరికీ ఆసక్తి లేకపోయినా, వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ఎంతో గొప్ప రాణించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉందంటూ కొనియాడారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఆ చిత్రానికి సంబంధించిన మూవీ టీం మొత్తం ఈ ఎపిసోడ్ లో పాల్గొని సందడి చేసారు. డాకు మహారాజ్ విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ చాలా సరదాగా సాగిపోయింది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ని చూడాలంటే వెంటనే ఆహా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటీవలే రామ్ చరణ్ తో కూడా ఒక ఎపిసోడ్ ని షూట్ చేసారు. మరో రెండు రోజుల్లో ఈ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుంది.