Aparichitudu Movie Casting: సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాల్లో ఒకటి ‘అపరిచితుడు'(Aparichitudu). చియాన్ విక్రమ్(Chiyaan Vikram) హీరో గా నటించిన ఈ చిత్రం అప్పటి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ‘చంద్రముఖి’ రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టింది. ఈ సినిమాతోనే విక్రమ్ కి తెలుగు లో మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ ఆయన దానిని సరిగా నిలబెట్టుకోలేకపోయాడు అనుకోండి అది వేరే విషయం. ఈ చిత్రం మాత్రం ఆరోజుల్లోనే 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు లో మొదటి వారం ఈ సినిమా విడుదలైన థియేటర్స్ ఖాలీగా ఉండేవి. కానీ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా మొదటి వారం తర్వాత వసూళ్లు ఊపందుకున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా షేక్ చేసింది ఈ చిత్రం. అలాంటి చిత్రాన్ని మొదట విక్రమ్ తో కాకుండా మరో హీరో తో చెయ్యాలని అనుకున్నాడట డైరెక్టర్ శంకర్.
ఆ హీరో మరెవరో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth). డైరెక్టర్ శంకర్ ముందుగా ఈ చిత్రాన్ని ఆయనతోనే చేయాలని అనుకున్నాడట. కథ కూడా వెళ్లి వినిపించాడు. కానీ రజనీకాంత్ ఎందుకో రిస్క్ అనుకోని చేయలేదట. ఆ తర్వాత ఈ కథ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వద్దకు వెళ్లిందట. శంకర్ ఎప్పటి నుండి చిరంజీవి తో సినిమా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. ఈ కథ సమాజానికి సంబంధించినది కాబట్టి ఆయన కచ్చితంగా చేస్తాడేమో అనుకున్నాడు. కథ మెగాస్టార్ కి అద్భుతంగా నచ్చింది. కానీ ఈ సినిమాలోని గెటప్స్ తనకు సూట్ అవ్వవు అనే చెప్పాడట. ఇదే కథ ని వేరే మోడ్ లో చెప్పే పని అయితే కచ్చితంగా చేస్తానని అన్నాడట. కానీ అందుకు శంకర్ ఒప్పుకోలేదు. ఇక చివరికి విక్రమ్ వద్దకు వెళ్ళాడు. అప్పటికీ, ఇప్పటికే ఛాలెంజింగ్ రోల్స్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది విక్రమ్ పేరే.
తాను రాసుకున్న ఈ మూడు పాత్రలకు విక్రమ్ మాత్రమే న్యాయం చేయగలదని శంకర్ బలంగా నమ్మి ఈ కథని ఆయనకు వినిపించాడట. విన్న వెంటనే విక్రమ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. వెంటనే డేట్స్ ఇచ్చి డైరెక్టర్ శంకర్(Shankar Shanmugham) కి పూర్తిగా దాసోహం అయ్యాడు. ఇక ఆ తర్వాత ఎలాంటి అద్భుతాలు ఈ సినిమా ద్వారా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే సినిమాని హిందీ లో రీసెంట్ గానే రణవీర్ సింగ్ తో రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో శంకర్ ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఒకవేళ చేసి ఉండుంటే మాత్రం ఆ రెండు సినిమాలకంటే పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శంకర్ మళ్ళీ విక్రమ్ తోనే ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.