Vikramarkudu : సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ఒక్క సక్సెస్ ని సాధించడానికి చాలామంది దర్శకులు నానా తంటాలు పడుతున్నారు. కానీ రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు మాత్రం వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు ఇప్పటివరకు ఆయన ఒక మంచి గుర్తింపు సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఆయన డైరెక్షన్లో చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇప్పటికే ఆయన చేసిన బాహుబలి (Bahubali), త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలు దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా రావడమే కాకుండా మంచి విజయాలను సాధించి భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబును హీరోగా పెట్టి చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
మరి ఈ సినిమాతో ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయన క్రేజ్ తారా స్థాయికి చేయబోతుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి 2006వ సంవత్సరంలో రవితేజ (Raviteja) ను హీరోగా పెట్టి చేసిన విక్రమార్కుడు (Vikramarkudu) సినిమాని మొదట వేరే హీరోతో చేయాలనుకున్నాడట. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో రవితేజ (Raviteja) ని పెట్టి చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read : విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ మందుకు బానిస అయ్యాడా..? అలా మారడానికి కారణం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు…
2025వ సంవత్సరంలో అపరిచితుడు (Aparichitudu) సినిమాతో భారీ విజయనందుకున్న విక్రమ్ (Vikram) ను ఈ సినిమాలో హీరోగా పెట్టి ఈ సినిమాని చేయాలని చూశాడట. కానీ విక్రమ్ ఎందుకో ఈ సినిమాకి సెట్ అవ్వడని లాస్ట్ మినిట్లో తను భావించి మళ్ళీ రవితేజతో సినిమా చేసినట్టుగా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడిని మించి వస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుండడం వల్ల ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుసగా 12 విజయాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన 100% సక్సెస్ రేట్ ను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…