
రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా తెలంగాణకు కృష్ణా జలాల్లో 34 శాతం నీళ్లు చాలని మంత్రి హరీశ్ రావు సంతకం పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 299 టీఎంసీలు సరిపోతాయని ఇరిగేషన్ మంత్రి హోదాలో హరీష్ రావు సంతకం చేశారని గుర్తు చేశారు. ఏడేళ్ల పాటు 299 టీఎంసీల నీటినే వాడుకున్నామన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ 203 జీవో ఇచ్చినప్పుడు రూ. 7వేల కోట్లు కేటాయించినప్పుడు కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు.