Anushka: టాలీవుడ్లో మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చారు నటి అనుష్క. ఓ వైపు మంచి గ్లామరస్ రోల్స్ చేస్తూనే.. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. సినిమాలో కొత్తదనాన్ని చూపించేందుకు స్వీటి ఎంతో కష్టపడుతుంది. సైజ్ జీరో సినిమాకు భారీగా బరువు పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

అయితే, అప్పటి నుంచి ఎంతగానే ప్రయత్నించినా మళ్లీ మునుపటిలా మారలేకపోతోంది అనుష్క. దీంతో తన సినిమాలపై ఈ ప్రభావం గట్టిగా పడుతోందట. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా కోసం బరువు తగ్గే పనిలో ఉందట స్వీటి. మునుపటిలా మళ్లీ సన్నగా, నాజూగ్గా మారేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోందట. ఇందుకోసం కచ్చితమైన డైటింగ్ పాటిస్తోందని తెలుస్తోంది.
స్లిమ్‌గా అయ్యేందుకు అనుష్క నీళ్లను ఎక్కువగా తీసుకుంటోందట. మధ్యలో కొబ్బరి నీళ్లు కూడా తాగుతుంది. ఫలితంగా బరువు తగ్గడమే కాకుండా చర్మ కూడా ప్రకాశవంతంగా మారుతుందని అంటోంది స్వీటి. కూరగాయల్లో ముఖ్యంగా ఫైబర్ శాతం ఎక్కువున్న వాటినే మెనూలో ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఎక్కువగా ఒకేసారి ఆహారం తినకుండా.. గ్యాప్ ఇస్తూ రోజుకు 5,6 సార్లు తింటోంది అనుష్క.
ఎంత బిజీగా ఉన్నా రాత్రి 8 గంటల్లోపే డిన్నర్ కంప్లీట్ చేస్తోందట. బయట ఆహారం పూర్తిగా తగ్గించి.. పూర్తిగా ఇంటి భోజనానికే పరిమితమైందని తెలుస్తోంది. నూనెతో తయారుచేసిన పదార్థాలను, కార్బొహైడ్రేట్స్ కలిగిన పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకుంటోంది. ఆహార నియమాలతో క్రమం తప్పకుండా యోగా, రెగ్యులర్ ఎక్సర్‌సైజులు చేస్తోందట. ఇలా అనుష్క బరువు తగ్గేందుకు కఠోర శ్రమ చేస్తోంది.