Chiru: ‘భోళాశంకర్’​ తొలి రోజు షూటింగ్​పై డైరెక్టర్​ ఆసక్తికర కామెంట్​!

Chiru: మెగాస్టార్​ చిరంజీవి హీరోగా మెహర్​ రమేశ్​ దర్శక్వంలో రానున్న సినిమా భోళా శంకర్​. తమిళ్​లో హిట్​గా నిలిచిన వేదాళం సినిమాకు ఇది రీమేక్​. కాగా, ఇటీవల భోళాశంకర్​ తొలి రోజు షూటింగ్​ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తొలి రోజు షూటింగ్​ బాగా జరిగిందని మెహర్​ రమేశ్​ పెద్దమ్మతల్లి గుడికి వెళ్లి.. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోతో పాటు.. పెద్దమ్మ తల్లి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 15, 2021 12:45 pm
Follow us on

Chiru: మెగాస్టార్​ చిరంజీవి హీరోగా మెహర్​ రమేశ్​ దర్శక్వంలో రానున్న సినిమా భోళా శంకర్​. తమిళ్​లో హిట్​గా నిలిచిన వేదాళం సినిమాకు ఇది రీమేక్​. కాగా, ఇటీవల భోళాశంకర్​ తొలి రోజు షూటింగ్​ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తొలి రోజు షూటింగ్​ బాగా జరిగిందని మెహర్​ రమేశ్​ పెద్దమ్మతల్లి గుడికి వెళ్లి.. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోతో పాటు.. పెద్దమ్మ తల్లి ఆశిస్సులతో తొలి రోజు షూటింగ్ బాగా అయ్యింది. అని పోస్ట్ చేశారు.

మెగాస్టార్ ఈ సినిమా కోసం తన లుక్​నే మార్చనున్నారు. పూర్తిగా డిఫరెంట్​ లుక్​లో కనిపించనున్నారు. ఇటీవల కాలంలో చిరు గుండు లుక్​లో కనిపించడం అందుకు ఉదాహరణ. ఆ లుక్​ ట్రయల్స్ ఈ సినిమా కోసమేనంటూ నెట్టింట్లో తెగ వైరల్​ అయ్యింది. మెహర్​ రమేశ్​ కూడా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హీరోలను మంచి స్టైలిష్​గా చూపించడంలో రమేశ్​కు మంచి టాలెంట్ ఉంది. మరి మెగాస్టార్​ను ఎలా చూపించనున్నారో వేచి చూడాలి.

ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా తీస్తున్నారు చిరు. వచ్చే ఏడాది ఫిబ్రవరి4న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో రామ్​చరణ్​ కూాడా నటిస్తున్నారు. కాగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు చిరు. ఇటీవల ఇందుకు సంబంధించిన పోస్టర్​ కూడా విడుదల చేశారు. ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు చిరు.