Australian Cricketer Mathuwade:బూటులో కూల్ డ్రింక్స్ పోసుకొని తాగాడు..: ఎందుకంటే..?

టీ20 వరల్డ్ కప్ 2021 ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది. గత కొన్నిరోజులుగా సాగిన ఈ పోరులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొత్తానికి కప్ ను గెలుచుకున్నారు. ప్రత్యర్థి న్యూజిలాండ్ చేసిన 173 పరుగులు లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనూ పూర్తి చేసిన టైటిల్ ను గెలుచుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందానికి హద్దు అదుపు లేకుండా పోయింది. విజేత అని తెలియగానే గ్రౌండ్ లోని ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇక మరికొందరు డ్రెస్సింగ్ రూంలో గోల గోల చేశారు. […]

Written By: NARESH, Updated On : November 15, 2021 12:16 pm
Follow us on

టీ20 వరల్డ్ కప్ 2021 ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది. గత కొన్నిరోజులుగా సాగిన ఈ పోరులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొత్తానికి కప్ ను గెలుచుకున్నారు. ప్రత్యర్థి న్యూజిలాండ్ చేసిన 173 పరుగులు లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనూ పూర్తి చేసిన టైటిల్ ను గెలుచుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందానికి హద్దు అదుపు లేకుండా పోయింది. విజేత అని తెలియగానే గ్రౌండ్ లోని ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇక మరికొందరు డ్రెస్సింగ్ రూంలో గోల గోల చేశారు. అయితే ఇద్దరు ఆటగాళ్లు చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అక్టోబర్ 23 నుంచి సాగిన టీ20 వర్డ్ కప్ మొత్తానికి ముగిసింది. విజేతగా ఆస్ట్రేలియా నిలవడంతో ఆ దేశ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్ కప్ మొదటిది కావడంతో వారి ఆనందం మరింత రెట్టింపయింది. ఆదివారం రాత్రి న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు పెట్టింది. కెప్టెన్ కేన్ విలియయమ్స్ 85 పరుగులు చేయడంతో కివిస్ ఒక దశలో మంచి స్కోరే చేసింది.

అయితే తారువాత బ్యాటింగ్ పట్టిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 5 పరుగులకే ఔటయినా డేవిడ్ వార్నర్, 53, మిచెల్ మార్ష్ 77 కొట్టటడంతో ఆస్ట్రేలియా సునయాసంగా విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్ల ప్రతిభకు కొదవా లేదు. ఐపీఎస్ సహా అన్ని సీరీసుల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. ప్రపంచంలోని అన్ని పిచ్ ల మీద వీరి ప్రతిభను కొనసాగిస్తారు. ఇదే ఆ జట్టుకు బలం చేకూరిందింది.

ఇక మొదటిసారి కప్ గెలుచుకున్న ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. సౌథీ బౌలింగ్ లో మాక్స్ వెల్ బౌండరీ దాటించడంతో ఆస్ట్రేలియా ఆటగాల్లు మైదానంలోకి వచ్చారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే ఈ క్రమంలో వికెట్ కీపర్ మాథ్యూవేడ్, ఆల్ రౌండర్ స్టోయినిస్ ఒక బూటులో కూల్ డ్రింక్స్ పోసుకొని తాగాడు. దీంతో గెలుపు సంబరాల్లో ఇదొక భాగమని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.