దేవుడు సృష్టించిన అద్భుతాల్లో మన భూమి ఒకటి.. మానవుడు ఈ భూమిపై ఎన్నో కనుగొన్నాడు.. సాధించాడు. కానీ ఇప్పటికీ కొన్ని అంతుచిక్కనివిగా ఉన్నాయి. మానవుడు ఇప్పటికీ వాటి గుట్టును తెలుసుకోలేకపోయాడు. ఏంటవి.? వాటి వింతలు విశేషాలు ఏంటో తెలుసుకుందాం..
ప్రపంచంలో మానవ మెదడుకు అంతుచిక్కని ఐదు రహస్యాలు ఇవీ..
1.కదిలే రాళ్లు sailing Stones:
మీరు చదివేది నిజమే అసలు రాళ్లు కదులుతాయా వాటికీ ప్రాణం ఉంటుందా సాధారణంగా మనం చుట్టుపక్కలచుసె రాళ్లకు వేటికి ప్రాణం ఉండదు కానీ కాలిఫోర్నియా లోని డెత్ వాలి అనే లోయలో కదిలేరాళ్ళ దృశ్యాలను మనం చూడవచ్చట ఆ ప్రాతంలో రాళ్లు నిజంగా కదులుతాయట అంతోమంది ఎన్నో సార్లు ఇక్కడ పరిశోధనలు చేసారు అసలు అవి అందుకు కదులుతున్నాయి ఆ రాళ్లకు ప్రాణం ఉందా లేకపోతె ఆ నేల ఆ రాళ్లకు ప్రాణం ఇచ్చిందా అని చాలాసార్లు ప్రయోగాలు చేసారు చివరికి చుట్టు వుండే గాలి మంచుల బలంవల్ల ఆ రాళ్లు కదులుతున్నాయి అని నిర్దారణకు వచ్చారు కొసమెరుపు ఏంటి అంటే ఆ ప్రయోగాలలో కొన్ని రాళ్లకు అడ్డుగా అరవై నుంచి డెబ్భై సెంటీమీటర్లు వున్న ఉక్కు కంబిలాన్ని ఉంచిన అవి తమ దారిని పక్కకు మళ్లించి ప్రయాణించటం విశేషం.
2.హెస్దాలెన్ వెలుగులు hesdaalen lights:
అసలు గ్రహాంతరవాసులు వున్నారా ఉంటే ఎలా వుంటారు గ్రహాంతరవాసులు అనగానే మనం సైన్స్ ఫ్రిక్షన్ సినిమాలో చూడటమే తప్ప దొరికిన ఫోటోలు నిజమైనా కావా అని నిర్దారణకు ఇంతవరకు ఎవరు రాలేదు చాలామంది శాస్రవేత్తలు అసలు గ్రహాంతరవాసులు లేరు అని తీసిపడేసిన ప్రపంచంలో ఎక్కడో ఒకచోట సాక్ష్యాలు రుజువు పుడుతూనే వున్నాయి ఇక అసలు విషయానికివస్తే నార్వే లోని హెస్తాలెస్ అనే విలెజ్ పక్కన వుండే లోయలో 1921 నుంచి ఏవో తెలియని లైట్స్ కనిపిస్తూ ఉంటాయి అంట అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం ఇరవై సర్లే కనిపించినా అసలు అవి ఏంటో ఎవరు కనిపెట్టలేకపోయారు. అవి గ్రహాంతరవాసులే అని కొందరి వాదన ఏది ఏమైనా ఆ ప్రాంతం మాత్రం ఇప్పుడు టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిపోయింది.
3.నాజ్కా బొమ్మలు Nazac lines :
చూడటానికి ఏదో వింత ఆకారంలో కనిపిస్తున్నా ఈ బొమ్మలు ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలలో పేరుగాంచినవి. దక్షిణ పెరు లోని నాస్కా ఎడారిలో మనకు ఈ గీతాలు కనిపిస్తాయి. ఆ బొమ్మలు ఎంత పెద్దవి అంటే వీటిలో కొన్ని అంతరిక్షంలోనుంచి కూడా చూడవచ్చట. చాల మంది శాస్రవేత్తలు ఇవి ఎలా ఏర్పడ్డాయో ఇంతబాగా కొన్ని వేల ఎకరాలలో వచ్చేటట్టు ఈ బొమ్మలను ఎవరుగిసారో తెలుసుకోవాలి అని చాల పరిశోధనలు చేస్తున్నారు. కాకపోతే వీటిని నాస్కా ప్రజలే తమ దేవుడు వారిని గుర్తించాలని గీశారు అని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఇంత పెద్దగా ఎలా గీశారు అనే అంతుచిక్కని అంశం.
4.నరకపు ద్వారం Door to hell:
నరకానికి ముఖద్వారంగా పిలువబడే ఈ ప్రదేశం టార్క్మెనిస్థాన్ దర్వేజీ అనే ప్రాంతంలో వుంది 1971లో కొంతమంది రష్యా ఇంజినీర్లు ఆయిల్ మరియు సహజ వాయువులు ఎక్కువ ఉండొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ డ్రిల్లింగ్ రిక్ తో డ్రిల్ల్ చేశారట చూస్తూ వుండగానే నేల కృంగిపోయి పెద్ద లోయగా మారిందంట. అక్కడనుంచి విడుదల అయ్యే విషవాయువులు చుట్టుపక్కల ప్రజలకు చేరితే ప్రమాదం అని గుర్తించి గ్యాస్ అయిపోవాలని మంట పెట్టారు.. కానీ అక్కడ ఆ మంట ఇంకా వెలుగుతూనే వుంది.
5.ఆత్మహత్యల అడవి Aokigahara:
మనిషి ఎప్పుడు చనిపోతాడు ఎలా చనిపోతాడు అనేది ఒక అంతుచిక్కని రహస్యం కానీ ఒక అడవి తన చుట్టుపక్కలకు ఎవరైనా వస్తే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తుందట. అవునండి జపాన్ లోని Aokighara అనే అడవి చాల భయంకరమైనదట. అక్కడ చెట్టుకో శవం పుట్టకో ఎముకల గూడు కనిపిస్తాయట అదేంటోమరి అక్కడకు వెళ్లినవారందరు వాళ్ళంతట వాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటారట అక్కడ చనిపోయినవాళ్లలో కొందరు చూడటానికి వచ్చిన వాళ్ళుఐతే కొంతమంది చావటానికే వచ్చినవాళ్లట ప్రతి సంవత్సరం అక్కడ చాల మంది శవాలను బైటకు తీస్తూ ఉంటారట కానీ ఒక్క 2003 లో మాత్రం ఏకంగా 110 శవాలను అక్కడ నుంచి బైటకు తీశారట. వాళ్ళు ఎలా చనిపోతున్నారు అన్నది ఎవరికీ తెలియని విషయం.
ఇవండీ ప్రపంచంలోనే ఇప్పటివరకు అంతుచిక్కని.. శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టని ఐదు రహస్యలు.. రహస్యాలుగా మిగిలిపోయాయి.