Kannappa: కన్నప్ప సినిమాలో పార్వతిగా నటించనున్న స్టార్ హీరోయిన్…విష్ణు అసలు ఎక్కడ తగ్గట్లేదుగా…

విష్ణు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఆయనకి ఇప్పటి వరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ లేదు. ఇక దాంతో ఇప్పుడు 150 కోట్ల భారీ బడ్జెట్ తో భక్తకన్నప్ప అనే సినిమాను చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : April 13, 2024 4:06 pm

Anushka will play Parvati in Kannappa movie

Follow us on

Kannappa: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి సినిమాలను చేసి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మోహన్ బాబు… ఈయన మొదట విలన్ పాత్రలను పోషించినప్పటికీ ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక కలెక్షన్ కింగ్ గా కూడా ఒక గొప్ప పేరును సంపాదించుకున్న ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి అసలు సినిమాలు చేయకుండా ఇండస్ట్రీ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. అయినప్పటికీ ఆయన్ని మిగతా డైరెక్టర్లు వాళ్ళ సినిమాల్లో పెట్టుకోవాలంటే భయపడిపోతూ ఉంటారు.

ఎందుకంటే ఆయన క్యారెక్టర్ లో కొంచెం తేడా వచ్చినా కూడా ఆయన అందరి పైన అరుస్తాడు అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో మోహన్ బాబుని సినిమాల్లో పెట్టుకోవటానికి యంగ్ డైరెక్టర్స్ భయపడిపోతుంటారు. నిజానికి మోహన్ బాబు చాలా మంచి నటుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న టాప్ త్రీ నటుల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయన సినిమాలేమీ చేయకుండా తన బిజినెస్ లకు సంబంధించిన పనులను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయన కొడుకుగా విష్ణు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఆయనకి ఇప్పటి వరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ లేదు. ఇక దాంతో ఇప్పుడు 150 కోట్ల భారీ బడ్జెట్ తో భక్తకన్నప్ప అనే సినిమాను చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి మొత్తం ఒక వారం రోజుల్లో తిరిగి రావాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ ను భాగం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్ర లో నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఇప్పుడు అనుష్క పార్వతి పాత్రలో నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక న్యూస్ కనక నిజమైతే మంచు విష్ణు నక్కతోక తొక్కినట్లేనని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అని చెప్తున్నారు. ఇక దానికి తోడు గా అనుష్క కూడా ఈ సినిమాలో భాగం అయితే దీనికి పెట్టిన పెట్టుబడి ఒక 4 రోజుల్లోనే తిరిగి వస్తుందని చెప్పాలి…