Anushka Shetty: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ ఇమేజి ఉన్న స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ. కేవలం వారి పేరు మీద బిజినెస్ జరుగుతుంటాది, అలాంటి హీరోయిన్స్ ఇమేజి ఎప్పటికీ మసకబారిపోదు. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా , ఆ హీరోయిన్స్ స్టార్ ఇమేజి చెరిగిపోదు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి.
అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె , అతి తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘అరుంధతి’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టి, స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ ని సొంతం చేసుకుంది.ఆరోజుల్లో ‘మగధీర’ మరియు ‘పోకిరి’ సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా ‘అరుంధతి’ నిల్చింది. ఆ సినిమా రికార్డ్స్ ని చాలా మంది స్టార్ హీరోలు కొన్నేళ్ల పాటు ముట్టుకోలేకపోయారు.
అలా ఒకపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వచ్చిన అనుష్క, బాహుబలి సిరీస్ తో తన రేంజ్ ని పాన్ వరల్డ్ కి వ్యాప్తి చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’ ఏకంగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈమె వెండితెర పై కనిపించలేదు. రీసెంట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేసింది.
అతి త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆమె నటన కి ఇక గుడ్ బై చెప్పబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ ఏడాది డిసెంబర్ లో ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని, అందుకే సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చెయ్యబోతుందట.