Game Changer- Pawan Kalyan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వం లో ‘గేమ్ చేంజర్’ ఆమె చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సాగుతుంది. మధ్యలో శంకర్ ‘ఇండియన్ 2 ‘ చిత్రాన్ని కూడా చెయ్యాల్సి రావడం తో నెలకు 15 రోజులు ‘గేమ్ చేంజెర్’ చిత్రానికి, మరో 15 రోజులు ‘ఇండియన్ 2 ‘ చిత్రానికి డేట్స్ కేటాయిస్తూ వచ్చాడు శంకర్.
దీంతో సంక్రాంతి కి రావాల్సిన ఈ సినిమా సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది.ఇక పోతే ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్ , అంజలి , ఎస్ జె సూర్య ,సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.
అదేమిటంటే ఈ చిత్రం లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తాడు.ఈ పాత్ర జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్రలోని లక్షణాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించాడట డైరెక్టర్ శంకర్.
అందుకే ఈ సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్ తోనే చెయ్యాలని ఆయన అనుకున్నాడు, మధ్యలో దిల్ రాజు ఆయన దృష్టిని రామ్ చరణ్ వైపు మరలించాడు, ఈ విషయాన్నీ స్వయంగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ పాత్ర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పండుగలాగా ఉంటుందని, సరిగ్గా ఎన్నికల సమయం లో విడుదల చేస్తే, జనసేన పార్టీ కి కూడా బాగా కలిసి వస్తుందని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి.