Anushka Shetty: సినీ ఇండస్ట్రీకి హీరోయిన్లే గ్లామర్ తెప్పిస్తారు. వారి అందచందాలతో ఆడియన్స్ ను థియేటర్లోకి రప్పిస్తారు. అయితే ఎంత అందమైన హీరోయిన్ అయినా కొన్నిరోజుల పాటు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతారు. ఆ తరువాత పెళ్లి చేసుకోవడమో లేదా సినిమాలు మానేయడమో చేస్తారు. అలనాటి సావిత్రి నుంచి సినిమాల్లో కొంతకాలం ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తరువాత సడెన్లీగా మాయమవుతున్నారు. అయితే వారు ఇలా కనుమరుగు కావడానికి అనారోగ్యాలేనా? అనే చర్చ సాగుతోంది. తాజాగా అనుష్క కూడా బరువు సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది.
బాహుబలి సినిమాలో నటించిన అనుష్కను చూస్తే కుంతల రాణి నిజంగా ఇలాగే ఉండేదేమోనని అనిపిస్తుంది. ఈ సినిమాలో అనుష్క తప్ప మరెవరూ చేయలేరన్నంత ఆ పాత్రకే క్రేజ్ తీసుకొచ్చిందీ భామ. ఈ మూవీ తరువాత అనుష్క అదే రేంజ్ లో సినిమాల్లో నటిస్తుందని అనుకున్నారు. కానీ ఆ తరువాత అనుష్క సినీ లైఫ్ అనుకున్నట్లు సాగలేదు. దీని తరువాత ‘భాగమతి’ అనే సినిమాలో కనిపించింది. ఇక ఆ తరువాత తక్కువగా వెండితెరపైకి వస్తోంది.
తాజాగా అనుష్క నవీన్ పోలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్అయింది. ఇప్పటికే సినిమా రివ్యూలు కూడా వచ్చేశాయి. అయితే సినిమా ప్రమోషన్లలో అనుష్క ఎక్కడా కనిపించలేదు. స్టార్ హీరోలతో సమానంగా అనుష్కకు ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. ఆమె వస్తుందని ఎంతో మంది ఎదురుచూశారు. కానీ అభిమానులను నిరాశపరిచింది. ఈ మూవీ ఈవెంట్స్ లో ఎక్కడా కనిపించలేదు.
అనుష్క ఇలా వేదికలపైకి రావడానికి ‘బరువు’ సమస్యేనన్న టాక్ వినిస్తోంది. భాగమతి సినిమా వరకు అందంగా కనిపించిన అనుష్క ఆ తరువాత బొద్దుగా తయారైందని తెలుస్తోంది. తాజాగా రిలీజైన మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి లోనూ కాస్త బొద్దుగానే కనిపిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల నుంచి సాగింది. కానీ ప్రస్తుతం అనుష్క పూర్తిగా మారిపోయినట్లు సమాచారం. అందుకే లైవ్ లోకి రాలేదని కొందరు చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయంపై అనుష్క ఎలా స్పందిస్తారో చూడాలి.