Homeఎంటర్టైన్మెంట్Anushka Shetty: హీరోయిన్ నిత్యామీనన్ కి భర్తగా అనుష్క..ఈ వింత సంఘటన ఏ సినిమాలో జరిగిందో...

Anushka Shetty: హీరోయిన్ నిత్యామీనన్ కి భర్తగా అనుష్క..ఈ వింత సంఘటన ఏ సినిమాలో జరిగిందో గుర్తుపట్టగలరా!

Anushka Shetty: అందం తో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఇండస్ట్రీ లో దొరకడం చాలా కష్టం. అలా అందం, టాలెంట్ రెండూ ఉన్న హీరోయిన్లు ఇండస్ట్రీ లో చిరకాలం కొనసాగుతూ ఉంటారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోయినా వీళ్ళ డిమాండ్ మాత్రం తగ్గదు. కేవలం వీళ్ళను వెండితెర మీద చూసేందుకు వేలాది మంది అభిమానులు తరళి వస్తుంటారు. అలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ అనుష్క, నిత్యామీనన్. ఇద్దరూ ఇద్దరే, కాకపోతే అనుష్క అందాల ఆరబోతలకు ఏ మాత్రం వెనుకాడదు, లిప్ లాక్ సన్నివేశాలకు కూడా ఒప్పుకుంటుంది. కానీ నిత్యా మీనన్ వీటికి పూర్తిగా విరుద్ధం. కానీ నటన విషయం లో మాత్రం ఇద్దరూ నేటి తరం హీరోయిన్ మేటి అని చెప్పొచ్చు.

అందుకే ఇంతమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి వచ్చినా కూడా వీళ్లిద్దరి మార్కెట్ చెక్కుచెదరలేదు. ఇది కాసేపు పక్కన పెడితే అనుష్క నిత్యా మీనన్ కి భర్తగా నటించిన విషయం మీకెవరికైనా గుర్తు ఉందా?. అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి సిగ్గు లేకుండా అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నాం!. వీళ్లిద్దరు కలిసి ప్రముఖ దర్శకుడు ‘గుణశేఖర్’ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ అనే చిత్రం లో నటించారు. రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ కథలో కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలడం కేవలం మగవాళ్ళకి మాత్రమే హక్కు. కానీ కాకతీయ సామ్రాజ్య మహారాజు గణపతి దేవా కి అమ్మాయి పుడుతుంది. దీంతో ‘రుద్రమదేవి’ అమ్మాయిగా పెంచకుండా, అబ్బాయిగా చిన్నతనం నుండే పెంచడం మొదలు పెడుతారు. ఈ విషయాన్నీ అత్యంత గోప్యంగా ఉంచుతారు. సమాజం దృష్టిలో రుద్రమదేవి అబ్బాయి కాబట్టి ఆమె వయస్సుకి వచ్చిన తర్వాత ముక్తంబా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది. ఆ ముక్తంబా పాత్ర పోషించిన హీరోయిన్ నిత్యా మీనన్. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చే నిత్యామీనన్, ఈ చిత్రం లో ఇంత సాధారణమైన పాత్ర పోషించడం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలగచేసిన విషయం. అలా అనుష్క ఈ చిత్రం లో నిత్యామీనన్ కి భర్త పాత్రలో కనిపించింది.

ఇకపోతే అనుష్క చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికీ సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత అనుష్క తెలుగు లో ‘ఘాటీ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఆమె మలయాళం లో ‘కథనార్’ అనే చిత్రం లో నటిస్తుంది. ఈ చిత్రం ద్వారా కెరీర్ లో ఆమె మొట్టమొదటిసారి విలన్ రోల్ లో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇన్ని రోజులు హీరోయిన్ పాత్రలు, వీరోచితమైన పాత్రల్లో నటిస్తూ వచ్చిన అనుష్కని ఆడియన్స్ విలన్ రోల్ లో అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version