Hari Hara Veera Mallu Promotion : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటివరకైతే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ రేంజ్ లో చేపట్టలేకపోతున్నారు. మరొక వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎందుకని ప్రమోషన్స్ చేయడం లేదు అనే ధోరణిలో కొంతమంది ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కి రావడం లేదా? ఇప్పుడు హీరోయిన్ దర్శకుడు కలిసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. ప్రమోషన్స్ లేకుండా ఏ సినిమాకి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరగవు. ప్రస్తుతం హర హర వీరమల్లు సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులకు తప్ప సగటు ప్రేక్షకులకు అయితే అంచనాలు లేవు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయ్యేది. ఇక వారం రోజుల ముందు నుంచి ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ప్రేక్షకుడిలో అంచనాలను పెంచుతూ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా?
Also Read : గుండె పగిలిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కమల్ హాసన్..వైరల్ అవుతున్న ట్వీట్!
ఎప్పుడు చూద్దామా అనే రేంజ్ లో ప్రతి ప్రేక్షకుడు ఆరాటపడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అలాంటిదేమీ కనిపించడం లేదు కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ రావాలంటే పవన్ కళ్యాణ్ ఒకసారి కనిపించి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తాడు.
కాబట్టి అప్పటినుంచి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలనే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారు. కానీ అంతకు ముందు కూడా కొన్ని ప్రమోషన్స్ చేస్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా సక్సెస్ సాధించడం అనేది మరొక ఎత్తుగా మారబోతోంది…