Anushka And Krish: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒకానొక సమయంలో ఒక హీరోయిన్ సైతం స్టార్ హీరోలకు పోటీగా నిలిచిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ‘సూపర్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క మొదటి సినిమాతోనే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించింది. ఇక ఆ తర్వాత ఆమె అరుంధతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాను చేసి హీరోలతో పాటు సమానమైన స్టార్ డమ్ ను అందుకుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఇక రాజమౌళి చేసిన బహుబలి మూవీ తర్వాత ఆమె టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తుందని అందరు అనుకున్నప్పటికి ఆమె ఇప్పటివరకు పెద్ద సినిమాలైతే చేయలేకపోయింది. కారణం ఏంటి అంటే ఆమె భారీగా బరువు పెరిగిపోయింది. దాని వల్ల ఆమె ఎక్కువగా సినిమాలను చేయలేక పోతోంది…
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
ఇక ఇదే సమయంలో డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి బయటకు వచ్చి అనుష్కతో ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ పాత్రను అనుష్క తప్ప ఎవరు చేయలేరని క్రిష్ చెప్పడంతో అనుష్క ఎలాగైనా సరే అలాంటి ఒక మంచి పాత్రని చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె చాలావరకు డైట్ మెయింటైన్ చేస్తూ సన్నబడి మరి ఈ సినిమాలో నటించినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం అటు అనుష్క, ఇటు క్రిష్ చాలా వరకు కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా స్క్రిప్ట్ లో మార్పులు చేశారట… ఇక షూటింగ్ సమయంలో కూడా క్రిష్ చాలావరకు ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నాడు. సినిమా షూట్ చేయడానికి కావలసిన లొకేషన్స్ విషయంలో గానీ ఇతర విషయాల్లో ఆయన చాలా బాధలనైతే పడ్డాడు. మరి ఇలాంటి సందర్భంలోనే సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఘాటి సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది.
తద్వారా వీళ్ళిద్దరికీ ఎలాంటి ఇమేజ్ ని సంపాదించి పెడుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం మారింది… ఇక క్రిష్ హరిహర వీరమల్లు సినిమా నుంచి బయటికి వచ్చాడు. కాబట్టి క్రిష్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే భారీగా విమర్శలను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…ఇక ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది తెలియాలంటే సెప్టెంబర్ 5వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…