Anushka Kathnar: మలయాళ నటుడు జయసూర్య-అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం కథనార్. హీరో జయసూర్య జన్మదినం పురస్కరించుకుని నేడు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న గ్లింప్స్ థ్రిల్లింగ్ హారర్ అంశాలతో సాగింది. ఆద్యంతం ఆసక్తి రేపింది. విజువల్స్ భయానకంగా ఉన్నాయి. గెటప్స్, లొకేషన్స్ మరో ప్రపంచాన్ని తలపిస్తున్నాయి. కథనార్ మూవీ కేరళ జానపథ కథల ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం.
ఫస్ట్ ఫస్ట్ గ్లింప్స్ లో జయసూర్య లుక్ ఆకట్టుకుంది. ఇది పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదల కానుందని సమాచారం. అందుకే అనుష్కను తీసుకున్నారు. హోమ్ చిత్ర దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నారు. కథనార్ టీజర్లో అనుష్కను పరిచయం చేయలేదు. ఇది ఒకింత నిరాశపరిచే అంశం. నవంబర్ 7న అనుష్క శెట్టి బర్త్ డే కాగా ఆరోజు స్పెషల్ టీజర్ విడుదల చేస్తారేమో చూడాలి.
కథనార్ చిత్రాన్ని గోకులన్ గోపాలన్ నిర్మిస్తున్నారు. ఆర్ రామానంద్ రచించారు. కథనార్ ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. హారర్, సస్పెన్సు జోనర్ అనుష్క శెట్టికి కలిసొచ్చింది. అరుంధతి, భాగమతి రూపంలో రెండు బ్లాక్ బస్టర్స్ అనుష్క అందుకుంది. మరి కథనార్ లో అనుష్క పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
మరోవైపు ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలకు సిద్దమవుతుంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్స్ కి అనుష్క దూరంగా ఉంటుంది. హీరో నవీన్ పోలిశెట్టి సోలోగా కష్టపడుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత అనుష్క సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. 2020లో విడుదలైన నిశ్శబ్దం అనంతరం అనుష్క మూవీ చేయలేదు.