Bhuma Akhila Priya: టిడిపికి అఖిలప్రియ గుడ్ బై.. చేరేది ఆ పార్టీలోనే?

భూమా నాగిరెడ్డి రాజకీయ వారసురాలుగా అఖిలప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అనూహ్యంగా టిడిపి గూటికి చేరారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు.

Written By: Dharma, Updated On : September 2, 2023 2:04 pm

Bhuma Akhila Priya

Follow us on

Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టిడిపిని వీడనున్నారా? కొత్త పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం అఖిలప్రియ రాజకీయ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టిడిపిలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అలాగని వైసీపీలో చేరలేని పరిస్థితి. దీంతో రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ భారత చైతన్య యువజన పార్టీలోకి అఖిలప్రియ వెళతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

భూమా నాగిరెడ్డి రాజకీయ వారసురాలుగా అఖిలప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అనూహ్యంగా టిడిపి గూటికి చేరారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం ఆమె ఆళ్లగడ్డ టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. అటు నంద్యాలలో సైతం యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఆళ్లగడ్డలో తాను, నంద్యాలలో తన సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అఖిల ప్రియ వివాదాస్పదంగా మారడం, కొన్ని కేసుల్లో చిక్కుకోవడంతో చంద్రబాబు ఆమెను పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గాల టిడిపి ఇన్చార్జిల సమావేశానికి సైతం అఖిలప్రియకు ఆహ్వానం లేదని తెలుస్తోంది.

నంద్యాల టిక్కెట్ను అఖిల ప్రియ పెదనాన్న కుమారుడు బ్రహ్మానంద రెడ్డికి చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. బ్రహ్మానంద రెడ్డి ప్రస్తుతం నంద్యాలలో దూకుడుగా వెళ్తున్నారు. అటు ఆళ్లగడ్డలోనూ అఖిల ప్రియకు టిక్కెట్టు డౌట్ గా కనిపిస్తోంది. దీంతో అఖిలప్రియ పార్టీ మారేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం.

ఆళ్లగడ్డలో యాదవ సామాజిక వర్గం అధికం. ఆ సామాజిక వర్గానికి 30 వేల ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అటు బలిజ సామాజిక వర్గం ఓట్లు సైతం ఉన్నాయి. దీంతో రామచంద్ర యాదవ్ పార్టీ అయితే యాదవ సామాజికవర్గం ఓట్లు లభిస్తాయని.. అఖిల ప్రియ భర్త బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆ సామాజిక వర్గం టర్న్ అవుతుందని అఖిల ప్రియ భావిస్తున్నట్లు సమాచారం. తనతో పాటు పదిమందికి టిక్కెట్లు ఇవ్వాలని.. ఆళ్లగడ్డలో ఎన్నికల ఖర్చు కింద 30 కోట్లు అందించాలని అఖిలప్రియ డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి రామచంద్ర యాదవ్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అఖిలప్రియ పార్టీ మారేందుకు దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.