https://oktelugu.com/

బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి అనుష్క..?

ఇప్పటికే మంచి ఎంటర్‌‌టైన్‌మెంట్‌ అందిస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 4.. మరింత డోస్‌ను పెంచుతోంది. అందులో భాగంగా ప్రేక్షకులకు మరో గుడ్‌న్యూస్‌ను అందించింది. వీకెండ్‌ అయిన ఈ ఆదివారమే ఆ సర్‌‌ప్రైజ్‌ అందివ్వబోతోంది. ఈ షోలో టాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్క సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. Also Read: పాపం.. బోయపాటికి కొత్త తలనొప్పి! అనుష్క నటించిన నిశ్శబ్దం అక్టోబర్‌‌ 2న ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. ఇప్పటికే నిశ్శబ్దం ట్రైలర్‌‌ అందరినీ ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 / 09:07 AM IST

    anushka

    Follow us on


    ఇప్పటికే మంచి ఎంటర్‌‌టైన్‌మెంట్‌ అందిస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 4.. మరింత డోస్‌ను పెంచుతోంది. అందులో భాగంగా ప్రేక్షకులకు మరో గుడ్‌న్యూస్‌ను అందించింది. వీకెండ్‌ అయిన ఈ ఆదివారమే ఆ సర్‌‌ప్రైజ్‌ అందివ్వబోతోంది. ఈ షోలో టాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్క సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: పాపం.. బోయపాటికి కొత్త తలనొప్పి!

    అనుష్క నటించిన నిశ్శబ్దం అక్టోబర్‌‌ 2న ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. ఇప్పటికే నిశ్శబ్దం ట్రైలర్‌‌ అందరినీ ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె బిగ్‌బాస్‌ షోకు వస్తున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితులతో బయట మార్కెట్లో ఎక్కడా ప్రమోషన్‌ చేసే పరిస్థితి లేదు. దీంతో సినిమా అందరికీ చేరేలా ఇలా ప్లాన్‌ చేశారు.

    ఇప్పుడు బుల్లితెర మీద బిగ్‌ బాస్‌ హంగామా నడుస్తోంది. అనుష్కతోపాటు నిశ్శబ్దం టీమ్‌ హౌస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షో ద్వారా ప్రమోషన్‌ నిర్వహిస్తే చాలా మంది ప్రేక్షకులకు చేరువ కావచ్చని టీమ్‌ సభ్యులు భావించారట.

    Also Read: మన టాప్ హీరోల సెంటిమెంట్స్ ఏంటో తెలుసా?

    హౌస్‌లోకి వెళ్లి అనుష్క కంటెస్టెంట్లతో సందడి చేయనున్నట్లు సమాచారం. అయితే.. గతంలోనూ బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రమోషన్లు జరిగాయి. ఇక ఇప్పుడు అనుష్క నిశ్శబ్దం సినిమా టీం రెడీ అయింది. బిగ్‌బాస్‌ సీజన్‌కు ముందు కంటెస్టెంట్లందరికీ కరోనా టెస్టులు చేయించి.. క్వారంటైన్‌లో పెట్టి హౌస్‌లోకి పంపించారు. మరి ఇప్పుడు ఈ టీంను అంత ఈజీగా లోనికి పంపిస్తారా..? లేక నాగార్జునతో కలిసి స్టేజీ మీదనే సందడి చేస్తారా..? ఇవి తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే..