మెగాస్టార్ చిరంజీవి రీమేక్ మూవీ “లూసిఫర్” సినిమా పై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. స్వీటీ అనుష్క మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందట. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా మేకర్స్ మాత్రం ఈ కాంబినేషన్ ను సెట్ చేస్తే అదిరిపోతుంది అని భావిస్తున్నారు. ఎందుకంటే ‘లూసిఫర్’లో హీరోకి చెల్లి పాత్రను మలయాళంలో అక్కడి స్టార్ హీరోయిన్ మంజు వార్యర్ చేసింది.
తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని, చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పాత్ర పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో ఇప్పుడు అనుష్క నటిస్తే.. ఈ ట్రాక్ ఓ రేంజ్ లో పేలిద్ది. అలాగే అనుష్క ఈ పాత్రలో నటిస్తే ఆమెకు ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు మరిన్నీ వచ్చే అవకాశం ఉంది. కానీ, ఆ మధ్య సుహాసిని కూడా ఈ రోల్ కు ఫిక్స్ అయిందని అన్నారు.
ఏది ఏమైనా ఈ సినిమా పూజా కార్యక్రమం మొదలైన దగ్గర నుండి అడ్డు అదుపు లేకుండా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర చాల కీలకంగా ఉంటుంది. ఆ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. సినిమాలో హీరో చేసే యాక్షన్ ఏమి ఉండదు. ఏం చేయాలన్నా తన అసిస్టెంట్ చేతే చేయిస్తూ.. తన హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఈ పాత్ర సత్యదేవ్ కి రావడం నిజంగా అతనికి మంచి అవకాశమే. ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇంతకీ ఏమిటి ఆ టైటిల్ అంటే ‘రారాజు’. నిజంగానే ఈ టైటిల్ మెగాస్టార్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మోహన్ రాజాకి ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. మోహన్ రాజా తమిళంలో “జయం” వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు.