Anupama Parameswaran: అనుపమ మెడలో తాళి బొట్టు.. ఫోటో వెనుక దాగున్న నిజం ఏంటో తెలుసా?

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకొనిపోయింది.ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయిన అను ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా బిజీగా గడుపుతోంది. బిజీ అంటే మామూలు బిజీ కాదండోయ్ పెద్ద సినిమాలే ఈమె చేతిలో ఉన్నాయి.

Written By: Swathi, Updated On : January 30, 2024 10:40 am
Follow us on

Anupama Parameswaran: టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె అందం, నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు మతిపోగొడుతుంటుంది. అందుకే ఫుల్ ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా అనుపమకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది ఈ క్యూటీ. తొందరలోనే స్టార్ హీరోల ఛాన్స్ గా మారిన హీరోయిన్ లలో ఈ అమ్మడు కూడా ప్లేస్ సంపాదించింది.

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకొనిపోయింది.ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయిన అను ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా బిజీగా గడుపుతోంది. బిజీ అంటే మామూలు బిజీ కాదండోయ్ పెద్ద సినిమాలే ఈమె చేతిలో ఉన్నాయి. అందులో ఈగల్, టిల్లు స్కైర్ సినిమాలు రిలీజ్ కు సిద్దమయ్యాయి కూడా. తెలుగులో వచ్చే ఈ సినిమాలు మాత్రమే కాదు తమిళ్ లో కూడా ఓ సినిమాలో నటిస్తోంది. జయం రవి నటిస్తున్న సైరన్ సినిమాలో కనిపించబోతుంది ఈ అమ్మడు.

ఇక సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీగా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది అనుపమ. ఇందులో భాగంగా మెడలో తాళి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఏమైంది అనుపాపకి ఇలా తాళితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగా పెళ్లి జరిగిందా అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే పట్టుచీర, ఒంటినిండా నగలు ధరించి మెడలో తాళిని చూపిస్తూ కనిపించిన ఈ భామ పెళ్లి చేసుకోలేదు.

ఆమె నటించిన సైరన్ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అందులో అనుపమ, జయం రవిని పెళ్లి చేసుకుంటుంది. ఆ సాంగ్ లోని మేకింగ్ స్టిల్స్ నే ఈ చిన్నది షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసి అను పాప ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందారు. అనుపమ చెప్పకుండా పెళ్లి చేసుకుందా? అంటూ కామెంట్లు చేశారు. కానీ అది నిజం పెళ్లి కాదని తెలిసి ఊపిరి పీల్చు కుంటున్నారు.