https://oktelugu.com/

ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్?

ఏపీలో మూడు రాజధానులకు దాదాపు అన్ని అడ్డంకులు తొలగినట్లే కన్పిస్తోంది. కేంద్రం ఇటీవల రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని స్పష్టం చేయడంతో జగన్ సర్కార్ కు లైన్ క్లియర్ అయినట్లయింది. దీంతో కొంచెం అటూ ఇటూగా జగన్ సర్కార్ మూడు రాజధానులకు ప్రారంభించడం ఖాయం కన్పిస్తోంది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీలోని మూడు రాజధానుల అంశంపై నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. Also Read: కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’ ఏపీ సీఎం జగన్ మూడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 8, 2020 / 02:33 PM IST
    Follow us on

    ఏపీలో మూడు రాజధానులకు దాదాపు అన్ని అడ్డంకులు తొలగినట్లే కన్పిస్తోంది. కేంద్రం ఇటీవల రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని స్పష్టం చేయడంతో జగన్ సర్కార్ కు లైన్ క్లియర్ అయినట్లయింది. దీంతో కొంచెం అటూ ఇటూగా జగన్ సర్కార్ మూడు రాజధానులకు ప్రారంభించడం ఖాయం కన్పిస్తోంది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీలోని మూడు రాజధానుల అంశంపై నజర్ పెట్టినట్లు తెలుస్తోంది.

    Also Read: కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’

    ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణకు కలిసి రానుందని అప్పట్లోనే తెలంగాణ నేతలు, నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే ఏపీ వెళ్లాల్సిన చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపాయి. ఏపీ మూడు రాజధానుల వల్ల తెలంగాణలోని హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అప్పట్లో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు కూడా చేశారు.

    ఏపీలో మూడు రాజధానుల అంశంపై అప్పట్లో మీడియా ప్రతినిధులు కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తే అది ఏపీ అంతర్గత విషయమంటూ పెద్దగా స్పందించలేదు. తెలంగాణలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. ఇప్పుడు ఏపీ రాజకీయాల జోలికి వెళ్లడం ఎందుకంటూ కొట్టిపారేశారు. అయితే మూడు రాజధానులు అంశం ఓ కొలిక్కి వచ్చాక చూద్దాం అన్నట్లు కేసీఆర్ అప్పుడలా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో మూడు రాజధానులకు దాదాపు లైన్ క్లియర్ కావడంతో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

    ఏపీలో మూడు రాజధానులు ఉంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టుబడి పెడుతారు? జగన్ సర్కార్ వారిని ఏ ప్రాంతంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తుంది? ఏపీకి ఎలాంటి అవకాశాలున్నాయనే వాటిపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారట. అలాగే మూడు రాజధానులపై రాజకీయాలు హిటెక్కడంతో ఇప్పట్లో పెట్టుబడులు ఏపీకి వెళ్లే అవకాశం లేదని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ అవకాశాన్ని కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే హైద‌రాబాద్ తోపాటు క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌ జిల్లాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ జిల్లాల్లోకి పెట్టుబడిదారులను ఆకర్షించేలా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

    Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

    రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ తగ్గాక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పెట్టుబడులను ఆహ్వానించేలా తెలంగాణ ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. దక్షిణాదిలో చైన్నె, బెంగూళూరు ప్రాంతాలు ఉన్నప్పటికీ అక్కడ పలు సమస్యలు ఉండటంతో మల్టి నేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. దీంతో హైదరాబాద్ తో సహా కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి పలు రాయితీలను కల్పించేలా మంత్రి కేటీఆర్ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం. కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణమాలను సీఎం కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.