Site icon OkTelugu

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంటర్వెల్ లో పవన్ కళ్యాణ్ భారీ డైలాగ్స్.. రిస్కీ స్తంట్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే!

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని ఎడిట్ చేసి, గ్లిమ్స్ గా గత నెల విడుదల చేసారు. ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోయింది.

ఆ గ్లిమ్స్ చూడగానే హిట్ కొట్టేసాము అనే ఫీలింగ్ ని కలిగించింది ఫ్యాన్స్ లో. పవన్ కళ్యాణ్ రేంజ్ వింటేజ్ మాస్ మరియు స్వాగ్ ని చూపిస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ బద్రి కాలం నాటి పవన్ కళ్యాణ్ ని మరోసారి బయటకి తీసినట్టుగా అనిపించింది. కేవలం పది రోజుల్లోనే ఇంత స్టఫ్ ని ఇస్తే, ఇక సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. నేడు హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మూవీ టీం వీడియో తో కలిపి ఒక ట్వీట్ వేశారు. ఈ సెట్స్ చూస్తూ ఉంటే ఎదో కాలేజీ సెట్స్ ని నిర్మిస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడ సెకండ్ షెడ్యూల్ లో ఇంటర్వెల్ ఫైట్ ని తెరకెక్కిస్తారట.

ఈ ఫైట్ కి ముందు పవన్ కళ్యాణ్ మార్క్ భారీ డైలాగ్స్ తో , రిస్కీ స్తంట్స్ తో కూడుకున్న ఫైట్స్ ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తారట. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ ఇంటర్వెల్ సన్నివేశం ది బెస్ట్ గా నిలిచిపొయ్యే విధంగా ఉండబోతుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ ఏడాదిలోగా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Exit mobile version