Anupama Parameswaran Viral Photos: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). ఆమె ఫోటో కూడా చూడక్కర్లేదు, కేవలం పేరు వింటేనే మెలికలు తిరిగిపోతుంటారు అబ్బాయిలు. అలాంటి క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమధ్య కాలం లో ఈమెకు పెద్దగా హిట్స్ ఉండేవి కాదు కానీ, రీసెంట్ గా మాత్రం వరుసగా హిట్స్ కొడుతూ ముందుకు దూసుకుపోతుంది. తెలుగు లో ఆమె నటించిన చివరి చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఇందులో విలన్ గా ఎంత అద్భుతంగా నటించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాకుండా గత ఏడాది ఈమె విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తో కలిసి గత ఏడాది ‘బైసన్’ అనే సూపర్ హిట్ చిత్రం లో నటించింది.
అయితే అప్పటి నుండి ఈ హాట్ బ్యూటీ ధృవ్ విక్రమ్ తో ప్రేమలో ఉందని, వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారని, ఇలా ఎన్నో రకాల వార్తలు ఈమధ్య కాలం లో వినిపిస్తున్నాయి. పైగా వీళ్లిద్దరు కలిసి అర్థ రాత్రి రెండు గంటల సమయం లో చెన్నై రోడ్స్ లో తిరుగుతున్న కొన్ని ఫోటోలను చూపిస్తూ. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని ఆధారాలతో సహా తేలింది. వాళ్ళు చూపిస్తున్న ఫోటోలు ‘బైసన్’ మూవీ షూటింగ్ సమయం లోనిది. అప్పుడు చెన్నై నుండి మధురై కి వెళ్తున్న సమయం లో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ లతో పాటు, మూవీ స్టాఫ్ ఒక పక్కన డివైడర్ మీద కూర్చొని ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు అప్పట్లో ధృవ్ విక్రమ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా, దాదాపుగా 22 లక్షల మంది లైకులు కొట్టారు.
ఈ ఫోటోలు పట్టుకొచ్చి, వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ కొన్ని మీడియా వర్గాలు ప్రచారాలు చేయడం మొదలు పెట్టింది. ఆ ఫోటోలకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ లింక్ ని మీరు క్రింద చూడొచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికి వస్తే, గత ఏడాది ఈమె ఏకంగా 6 సినిమాల్లో హీరోయిన్ గా నటించిని. అందులో డ్రాగన్, కిష్కిందపురి, బైసన్ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ ఏడాది ఆమె ప్రస్తుతం ‘లాక్ డౌన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తో పాటు తెలుగు లో ఆమె మరో రెండు సినిమాలు చేయడానికి సంతకం చేసినట్టు తెలుస్తోంది. వీటి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.