Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Gift Project To Friends: తన స్నేహితుల కోసం 1000 కోట్ల...

Allu Arjun Gift Project To Friends: తన స్నేహితుల కోసం 1000 కోట్ల ప్రాజెక్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చేసిన అల్లు అర్జున్!

Allu Arjun Gift Project To Friends: ఈమధ్య కాలంలో ఎంతోమంది స్నేహానికి విలువ ఇవ్వని వాళ్ళని మన చుట్టూ చూస్తూనే ఉన్నాం. మన దగ్గర సహాయం పొంది, మనకి అవసరమైనప్పుడు సహాయం చెయ్యడానికి ముఖం చాటేసే వాళ్ళు మీ జీవితాల్లో ఎదురు అయ్యే ఉంటారు. అలాంటి వాళ్ళు కనీసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని చూసి అయినా సిగ్గు తెచ్చుకుంటే మంచిది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తనతో పాటు చిన్నతనం నుండి ప్రయాణం చేసిన తన స్నేహితులను అల్లు అర్జున్ మర్చిపోకుండా, వాళ్ళ కోసం చేసిన ఒక్క గొప్ప పని ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ త్వరలోనే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ జూన్ నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాణం లో తన స్నేహితులైన బన్నీ వాసు, చిన్ననాటి స్నేహితులు స్వాతి, నటరాజ్, సందీప్ లను కూడా భాగస్వాములను చేశాడు. వీరిలో నటరాజ్, సందీప్ వంటి వారు అల్లు అర్జున్ కి స్కూల్ నుండి స్నేహితులు . అదే విధంగా స్వాతి అల్లు అర్జున్ కి సమీప బంధువు, చిన్ననాటి నేస్తం కూడా అని తెలుస్తోంది. ఇప్పుడు కాదు, గతం లో కూడా అల్లు అర్జున్ ఇంతే. తన తల్లివైపు బంధువులైన ‘మొత్తంశెట్టి మీడియా’ సంస్థను ‘పుష్ప 1’ లో భాగస్వామిగా చేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఆయన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తన చిన్ననాటి స్నేహితులను భాగస్వాములను చేసాడు. తాను ఎదిగిన తర్వాత తన స్నేహితుల జీవితాలు కూడా స్థిరపడాలి అని, వాళ్లకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగం కలిగించడం చూస్తుంటే అల్లు అర్జున్ మనసు ఎంత గొప్పదో అర్థం అవుతోంది.

బన్నీ వాసు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి కెరీర్ ప్రారంభం నుండి ఒక సలహాదారుడిగా కొనసాగుతూ వచ్చాడు. తనని నమ్ముకొని ఇంత దూరం ప్రయాణం చేసినందుకు బదులుగా అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ మూవీ లో భాగస్వామిని చేసాడు, అదే విధంగా లోకేష్ కనకరాజ్ తో చేయబోయే సినిమాకు కూడా భాగస్వామిని చేశాడు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు అల్లు అర్జున్ తన మాట తీరు వల్ల , సోషల్ మీడియా లో ట్రోల్ అవుతూ ఉంటాడు కానీ, ఆయన మనసు బంగారం లాంటిది, నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనేది మరోసారి స్పష్టంగా నిరూపితమైంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version