Rajamouli Movies: దర్శక ధీరుడు రాజమౌళి బుల్లితెరపై శాంతినివాసం అనే సీరియల్ తీసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎన్టీయార్ ను హీరోగా పెట్టి స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా తీసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీ లో తన ప్రస్థానం అనేది కొనసాగుతూ వస్తుంది.
త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. అయితే రాజమౌళి సక్సెస్ లో తన భార్య అయిన రమా రాజమౌళి కూడా చాలా వరకు కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ఆయన తీసిన సినిమాల్లో రమా రాజమౌళి కి రెండు సినిమాలు అంటే అసలు నచ్చదట. అందులో మొదటిది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అయితే, రెండోది యమదొంగ సినిమా. ఈ రెండు సినిమాలను రాజమౌళి ఎందుకు తీశాడో తెలియదు అంటూ ఆమె కొన్ని సందర్భాల్లో మాట్లాడింది.
అలాగే ఈ రెండు సినిమాలను రాజమౌళి చేయకుండా ఉంటే బాగుండేది అంటూనే, ఈ సినిమాలని తను చూడడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా చూపించను ఎందుకంటే ఇవి చాలా బోర్ కొడుతాయంటు తను ఈ విషయం మీద మాట్లాడడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక విషయం మీద ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతవరకు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమెకు నచ్చని రెండు సినిమాల్లో రెండు కూడా ఎన్టీఆర్ వే కావడం విశేషం. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే పాన్ వరల్డ్ లో రాజమౌళి క్రేజ్ అనేది భారీ స్థాయిలో పెరుగుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే హాలీవుడ్ లో గ్రేట్ డైరెక్టర్ అయిన జేమ్స్ కెమరూన్ లాంటి డైరెక్టర్ కూడా రాజమౌళితో టచ్ లో ఉంటున్నాడు అంటే రాజమౌళి స్టాండర్డ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…