https://oktelugu.com/

Dhanush: నిజమైన దానం గుణం అంటే ఇదీ… ధనుష్ చూసి నేర్చుకోండయ్యా!

Dhanush: పావలా దానానికి పదిరూపాయలు పబ్లిసిటీ చేసుకోవడం ఈ రోజుల్లో ట్రెండ్. ఎదుటివారికి సాయం చేయాలన్న సామాజిక స్పృహ కంటే, సదరు దానం ద్వారా క్రెడిబిలిటీ, పబ్లిసిటీ తెచ్చుకోవాలనే ఆత్రమే చాలా మందికి ఎక్కువ. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు పెద్దలు. ఈ తరం దానకర్ణులు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ప్రచార ఆర్భాటమే పరమావధిగా వాళ్ళ దానాలు సాగుతున్నాయి. సాయం చేస్తూ బాధితులతో ఫోటోలు దిగడం, ఆ ఫొటోలకు […]

Written By:
  • Shiva
  • , Updated On : November 26, 2021 / 03:41 PM IST
    Follow us on

    Dhanush: పావలా దానానికి పదిరూపాయలు పబ్లిసిటీ చేసుకోవడం ఈ రోజుల్లో ట్రెండ్. ఎదుటివారికి సాయం చేయాలన్న సామాజిక స్పృహ కంటే, సదరు దానం ద్వారా క్రెడిబిలిటీ, పబ్లిసిటీ తెచ్చుకోవాలనే ఆత్రమే చాలా మందికి ఎక్కువ. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు పెద్దలు. ఈ తరం దానకర్ణులు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ప్రచార ఆర్భాటమే పరమావధిగా వాళ్ళ దానాలు సాగుతున్నాయి.

    Dhanush

    సాయం చేస్తూ బాధితులతో ఫోటోలు దిగడం, ఆ ఫొటోలకు తమ పిఆర్ఓ ల ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం కల్పించడం చేస్తున్నారు. మరోవైపు సదరు స్టార్ హీరో ఫ్యాన్స్ ఆయన ఔదార్యాన్ని కొనియాడుతూ ఎలివేషన్స్ తో రెచ్చి పోతూ ఉంటారు. దానం తీసుకుంటున్న బాధితుల వ్యక్తిగత జీవితం, దుర్భర స్థితి గురించి అందరూ చెప్పుకునేలా చేస్తారు. పరిశ్రమలో ఉన్న మన నేటి దానకర్ణుల తీరు ఇలా ఉంది.

    Also Read: శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు అండగా నేను కూడా అంటున్న హీరో ధ‌నుష్…

    దానం చేయాలనే వీరి నిర్ణయం.. దక్కే పబ్లిసిటీ మీద ఆధారపడి ఉంటుందేమో తెలియదు కానీ, అన్ని సందర్భాల్లో స్పందించరు. దానికి ఉదాహరణ తాజా ఉదంతం. సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కోవిడ్ బారిన పడ్డారు. ఐసీయూ చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమంగా మారింది. వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. అభిమానాన్ని తాకట్టు పెట్టి సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులు పరిశ్రమ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా.. నేనున్నాను అంటూ ముందుకు వస్తున్న సోనూ సూద్ రంగంలోకి దిగారు.

    నాణానికి మరోవైపు అన్నట్లు స్టార్ హీరో ధనుష్(Dhanush) విషయం తెలిసిన వెంటనే స్పందించారట. ఆయన శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి రూ. 10లక్షల ఆర్ధిక సాయం చేశారట. ఈ విషయాన్ని ఆయన బయట పెట్టవద్దని కుటుంబ సభ్యులను కోరాడట. డప్పుల చప్పుళ్ళు, ఫ్యాన్స్ ఎలివేషన్స్ కోరుకోని ధనుష్ తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పబ్లిసిటీ, ఫేమ్ కోసం దానాలు చేసే హీరోలకు గుణపాఠం చెప్పినట్లయ్యింది.

    Also Read: శివ శంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను : మంచు విష్ణు

    Tags